Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సురేష్ ‘షాపింగ్ మాల్’
      'ప్రేమిస్తే'వంటి హృదయాన్ని హత్తుకునే ప్రేమకథా చిత్రాన్ని అందించిన సురేష్‌ కొండేటి తాజాగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'అంగాడి తెరు' తెలుగు అనువాద హక్కులు పొందారు. సంతోషం స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో ఎస్‌.కె.పిక్చర్స్‌ ద్వారా 'షాపింగ్‌ మాల్‌' పేరిట ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వసంతబాలన్‌ దర్శకత్వంలో అంతా కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం 15 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్‌ సృష్టించింది.

ఈ చిత్రవిశేషాలను నిర్మాత సురేష్‌ కొండేటి చెబుతూ - "ప్రేమిస్తే సినిమా తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయాలనే ఆకాంక్షతో దాదాపు ఐదు సంవత్సరాలుగా మంచి సినిమా కోసం ఎదురు చూశాను. ఈ నేపథ్యంలో తమిళ 'అంగాడి తెరు'ని చూశాను. ప్రేమిస్తేకన్నా మంచి సినిమా అవుతుందనిపించింది. ఈ సినిమా అనువాద హక్కులకు ఎంతోమంది పోటీపడ్డారు.

అయితే మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో అయ్యంగరన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ అనువాద హక్కులను మాకే ఇచ్చింది. యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని రూపొందిన చిత్రం ఇది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు. మగేష్‌, అంజలి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంథోని, జీవీ ప్రకాష్‌కుమార్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహనిర్మాత: ఊటుకూరి నాగార్జున్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com