Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
బాలకృష్ణ ‘సింహా’
     నందమూరి బాలకృష్ణ హీరోగా, స్నేహ వుల్లాల్‌, నమిత హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సింహా’. ఈ చిత్రానికి సంబంధించి పాటల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి పాటల చిత్రీకరణకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ- ‘‘రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎ.ఎస్‌. ప్రకాష్‌ కళా దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో వేసిన మూడు సెట్స్‌లో ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య దర్శకత్వంలో బాలకృష్ణ, నమితలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ నెలాఖరులో రామోజీ ఫిల్మ్‌ సిటీలో మరో మూడు సెట్స్‌ వేసి బాలకృష్ణ, స్నేహ వుల్లాల్‌లపై మరో పాటను చిత్రీకరించనున్నాం’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత బి. మహేంద్రబాబు మాట్లాడుతూ- ‘‘ఏకధాటిగా హైదరాబాద్‌, విశాఖపట్నంలలో జరిగే షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా ‘సింహా’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఇతరపాత్రలలో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్‌, కె.ఆర్‌.విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్‌, ఎల్బీ.శ్రీరాం, ఝాన్సీ, సన, సైరాబాను, వినోద్‌లతో పాటు ప్రముఖ మలయాళ విలన్‌ సాయికుమార్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: ఆర్దర్‌ ఎ.విల్సన్‌, ఫైట్స్‌: స్టన్‌ శివ, కళ: ఎ.యస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: డి.యోగానంద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి. మహేంద్రబాబు, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com