ఫిలిం న్యూస్
 
 
 
 
శివాజీ చందన్ మూవీస్ చిత్రం
శివాజీ హీరోగా విభిన్న నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. కిరణ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ చందన్‌ మూవీస్‌ పతాకంపై సీడీ నాగేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంజాబీ నటి రీతుకౌర్‌ కథానాయికగా పరిచయమవుతున్నారు. దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ ‘నగర నేపథ్యంలో నడిచే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. శివాజీ ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా నటిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఎన్నో సాంకేతిక సమస్యలు పరిష్కరించి మంచి పేరుతెచ్చుకున్న హీరో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చిక్కుముళ్లను ఎలా తొలగించుకుని విజయం సాధించాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం’ అని చెప్పారు. నిర్మాత సీడీ నాగేంద్ర మాట్లాడుతూ ‘మే 5 నుంచి 21 వరకూ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ జరిగింది. శివాజీ, కోట శ్రీనివాసరావు, రంగనాధ్‌, వైజాగ్‌ ప్రసాద్‌, అల్లరి సుభాషిణి, భిక్షు, రమేష్‌, రేణు తదితరులపై ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించాం. జూన్‌ 10 నుండి నెలాఖరు వరకూ జరిపే రెండో షెడ్యూల్‌తో టాకీపార్ట్‌ పూర్తవుతుంది. జు లైలో జరిపే మూడో షెడ్యూల్‌లో పాటలు చిత్రీకరిస్తాం. టైటిల్‌ త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు.