Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
కె.విశ్వనాథ్ ‘శుభప్రదం’
     'శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై చెరుకూరి కౌసవేంద్రరావు సమర్పణలో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘శుభప్రదం’ అని పేరు పెట్టారు. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంగా నటిస్తున్న ఈ చిత్రం లోగోను కె.విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ - కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నరేష్ కి అవకాశం వచ్చినందుకు అతనికంటే నేనే ఎక్కువ ఆనందపడ్డాను. నాలాంటి కమర్షియల్ దర్శకులు ఎందరున్నా, కమర్షియల్ చిత్రాలు ఎన్ని తీసినా - మేం తీసే పది చిత్రాలకు విశ్వనాథ్ గారి ఒక్క చిత్రం ధీటుగా నిలుస్తుంది. తెలుగు సాహిత్యం, కళలను ప్రతిబింబించేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అన్ని తరగతుల వారికీ నచ్చేలా తీస్తారు - అని అన్నారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ - ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు చూస్తారా? అని సందేహించే దశలో పామర జనాన్ని కూడా అలరించేలా విశ్వనాథ్ గారు చిత్రాలు తీసారు అని అన్నారు. రచయిత సాయినాథ్ మాట్లాడుతూ - మకుటాయమానం అయ్యే చిత్రాలు ఎప్పుడో వస్తాయి. అందులో ఇది ఒకటి. కళాత్మకం, రసాత్మకం, సందేశాత్మకంగా ఉండే ఈ చిత్రం యూనిట్ లోని అందరికీ మంచి పేరు తెస్తుందని అన్నారు.

కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - ప్రయత్నం మాది - ఫలితం భగవంతుడిది. నా చిత్రాల వరవడికి నరేష్ ఎలా సరిపోతాడని అంతా సందేహపడ్డారు. అయితే ఈ చిత్రం తర్వాత ‘అల్లరి’ నరేష్ ‘శుభప్రదం’ నరేష్ అని పిలిపించుకునేలా కష్టపడి చేశాడు. నటీనటులు అంతా తమ శక్తి సామర్థ్యాలను మించి చేశారు. మణిశర్మ మంచి సంగీతాన్ని, వేణు చక్కటి ఫోటోగ్రఫీని అందించారు. తక్కువ సమయంలో వేగంగా ఈ చిత్రం పూర్తయ్యేందుకు అంతా సహకరించారు - అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు హరిగోపాలకృష్ణ, పీలా నీల తిలక్ పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com