తేజస్విని సాయి ఫిలింస్ పతాకంపై, ఆకాంక్షసాయి సమర్పణలో, కె.రవికుమార్ చౌదరి నిర్మాతగా, పి.వేణుగోపాల్ చౌదరిని దర్శకునిగా
పరిచయం చేస్తూ ‘‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి’’ అను భక్తిరస చిత్రం అన్ని హంగులతో త్వరలో ప్రారంభం కానున్నది.
నిర్మాత కె.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ - కార్తికేయుడిగా బేబి ఆకాంక్షసాయి నటిస్తుందని, ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో
నటించనున్నారని, మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్
ప్రారంభించనున్నామని తెలియజేశారు.
దర్శకుడు పి.వేణుగోపాల్ చౌదరి మాట్లాడుతూ - సర్ప, కుజ దోషాలకు అధిపతి అయిన ‘‘శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి’’ జీవిత చరిత్ర
తెరకెక్కిస్తున్నామని, ఈ చిత్రంలో 9 పాటలు, 9 శ్లోకాలు వుంటాయని, ఈ చిత్రం ద్వారా నరేన్ ను సంగీత దర్శకుడిగా పరిచయం
చేస్తున్నామని, అద్భుతమైన ట్యూన్లతో రికార్డింగ్ జరుగుతుందని, పాటల రికార్డింగ్ పూర్తవగానే సెట్స్ పైకి వెళ్ళనున్నామని తెలియజేశారు.
ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : బి.రామ్కుమార్, పాటలు : పెల్లూరి బాలచందర్, సురేష్ గంగుల, మాటలు : రమణ,
సంగీతం : నరేన్, ఆర్ట్ : శిష్లా, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సమర్పణ : ఆకాంక్షసాయి, నిర్మాత : కె.రవికుమార్ చౌదరి, స్క్రీన్-ప్లే,
దర్శకత్వం : పివేణుగోపాల్ చౌదరి.