హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కథానాయకుడుగా 20కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ చిత్రం ‘సూపర్ కౌబాయ్’. ఎ.జి.యస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో కల్పాతి యస్.అగోరం ఈ చిత్రానికి సమర్పకులు. ఈ చిత్రం గురించి రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘‘ఎ.జి.యస్. సంస్థ ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మిస్తోంది. దర్శకుడు శింబుదేవన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. ఇందులో యాక్షన్‌తో పాటు మంచి వినోదం కూడా వుంటుంది. జి.వి.ప్రకాష్ అద్భుతమైన సంగీతం చేసాడు. అరుదైన లొకేషన్లలో చిత్రీకరించిన ‘సూపర్ కౌబాయ్’ నాకు సూపర్ డూపర్ హిట్ చిత్ర అవుతుంది’’ అన్నారు. దర్శకులు శింబుదేవన్ మాట్లాడుతూ ‘‘18వ శతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ ఎడ్వంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
మాస్ ఆడియన్స్‌తో పాటు మహిళలు, చిన్న పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఈ చిత్రం ఉంటుంది. రెడ్ ఇండియన్స్ గురించి ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా చూపిస్తున్నాం. అందుకోసం హాలీవుడ్ స్లైల్లో కేరళలో 300 మందితో రాత్రింబవళ్ళు అద్భుతమైన సెట్ వేయించాం. భారత చలన చిత్ర చరిత్ర లోనే ఇది భారీ సెట్ అవుతుంది. ఇందులో నటించిన నటీ నటులందరికీ హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడం జరిగింది’’ అన్నారు. నిర్మాత కల్పాతి యస్. అగోరం మాట్లాడుతూ ‘‘మంచి అభిరుచి వున్న తెలుగు ప్రేక్షకుల్ని వినోదపరచడా నికి మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.