ప్రముఖ సినిమా వార పత్రిక ‘సూపర్ హిట్’ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ
సందర్భంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఓ కార్యక్రమం
నిర్వహిస్తున్నట్లు సంపాదకులు బి.ఎ.రాజు చెప్పారు. సంక్రాంతికి ముందుగా జరిపే ఈ
కార్యక్రమానికి ‘సూపర్ హిట్ సంక్రాంతి సంబరాలు’ అని పేరు పెడుతున్నట్లు
చెప్పారు. ఇందులో భాగంగా ‘సూపర్ హిట్ సినిమా అవార్డు’లను ప్రవేశ
పెడుతున్నామని, ప్రతి ఏటా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గత
ఇరవయ్యేళ్ళలో సంచలన చిత్రాలు తీసిన నిర్మాతలను సత్కరిస్తామని తెలిపారు.
బి.జయ మాట్లాడుతూ - సాధారణ జర్నలిస్ట్ గా ఉంటూ పత్రిక పెట్టి ఇరవై ఏళ్ళు
విజయవంతంగా నడపడం సామాన్యమైన విషయం కాదు. అందుకు పరిశ్రమలోని వారి
సహకారం ఎంతైనా ఉంది. పత్రిక పెడుతున్నట్లు తెలిసి బాలయ్య బాబు ఒక రోజంగా
ఫోటో సెషన్ చేసి సహకరించారు. దాసరి గారు మమ్మల్ని అభినందించి,
ప్రోత్సహించారు. ‘సూప్ హిట్’ కేవలం ఓ పత్రికగానే కాకుండా గర్వకారణమైన
జ్ఞాపకాలను మిగిల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఇరవై ఏళ్ళ ఉత్సవాన్ని
‘ఇండియన్ ఐడిల్’ స్థాయిలో భారీ స్థాయిలో నిర్వహించాలనుకుంటున్నాం. ఈ
సందర్భంగా ఎంతో సహకారాన్ని అందిస్తున్న హీరోల అభిమానులు, ఏజంట్లు, మా
సిబ్బందకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం - అని అన్నారు.