నటుడికి ఓ పాత్ర ద్వారా మెప్పించడం కళ. ద్విపాత్రాభినయం చేయడం ఓ ఛాలెంజ్. ఆపై ముగ్గురు, నలుగురుగా
గెటప్స్‌మారుస్తూ వైరుధ్యాన్ని చూపడం విశేషం. ఎన్.టి.ఆర్.కు ఇటువంటి పలు గెటప్స్ వేయడమంటే మహా సరదా.
ఆటువంటివారిలో ప్రముఖ నటులున్నారు. శివాజీగణేషన్ నుంచి నేటితరం హీరోలుకూడా తమిళనాట చేసినవారే. తెలుగువాడైనా
తమిళంలో సక్సెస్ అయిన విక్రమ్ గురించి తెలియంది కాదు. 'అపరిచితుడు'లో భిన్న పార్శ్వాఆలను పోషించి మెప్పించినవాడే.
ప్రత్యేకంగా చెప్పాల్సింది కమల్‌హాసన్ గురించే. తనలోని నటుడ్ని రకరకాల పాత్రలతో ఆవిష్కరించాడు. అవన్నీ మొహం
మొత్తినట్లున్నాయో ఏకంగా పది పాత్రలు చేసేశాడు. 'దశావతారం'లో తన కళావిశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం
కథానాయకులు రొటీన్‌గా ఒకటి రెండు పాత్రలు చేసి మెప్పించడంలో విశేషం కన్పించడంలేదు. అందుకే ఎక్కువ గెటప్స్‌లో
కన్పించేట్లు ప్రయత్నిస్తున్నాడు. నటుడు సూర్య అటువంటి కొత్తప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
గతంలో గజనిగా భిన్నకోణాలు ఆవిష్కరించిన సూర్య తాజాగా ఏకంగా 20 పాత్రలు చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు
తెలిసింది. తమిళంలో ఆ చిత్రానికి 'మాట్రన్' అనే పేరు పెట్టారు. 'మాట్రన్' అంటే తెలుగులో అపరిచితుడు అనే అర్థం
వస్తుంది. దీనికి దర్శకుడు కె.వి.ఆనంద్. సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సమర్పణలో వచ్చిన 'రంగం' చిత్రానికి ఆయనే దర్శకుడు.
హిందూలో సినిమాటోగ్రఫార్‌గా ఉన్న ఆయన సినిమారంగంలో రాణించి దర్శకుడయ్యాడు. 'రంగం' చిత్రం సమకాలీన రాజకీయ
వ్యవస్థను, ఫొటోజర్నలిజంకు నడుమ జరిగే కథ. ఈ చిత్రం తమిళనాడులో సక్సెస్ అయింది. తెలుగులో 'ఎ'క్లాస్ సెంటర్లలో
విజయవంతంగా నడుస్తోంది. అటువంటి దర్శకుడు ఆనంద్ మనసులోంచి పుట్టిన పాత్రే ఇరవై. అవి ఎలా ఉంటాయి..
ఏమిటి.. అనేది కొద్దిరోజుల్లో తెలియనుంది. త్వరలో ఈ కథ సెట్‌పైకి రానుంది.