అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో నట వారసుడు సుశాంత్. కాళిదాస్, కరెంట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ కథానాయకుడు త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నున్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ ఫేం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తారు.
అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో, శ్రీనాగ్ కార్పోరేషన్ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘‘సుశాంత్ శారీరక భాషకు సరిపోయే ఓ విభిన్నమైన కథాంశం ఇది. సుశాంత్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా ఈ చిత్రం నిలిచిపోతుందనే నమ్మకం వుంది.
సుశాంత్ గత రెండు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రంతో నటుడిగా అభినందనలతో పాటు ఓ కమర్షియల్ హిట్‌ను కూడా అందుకుంటాడు. మే నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.