కన్నడలో ఘనవిజయం సాధించిన ‘తాజ్ మహల్’ను హీరో శివాజీ తెలుగులో నిర్మిస్తున్నాడు. శివాజీ, శృతి జంటగా నటిస్తున్న ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం గురించి శివాజీ మాట్లాడుతూ- ‘మా సినిమాలో ప్రేమకథ కాలేజీ నేపథ్యంలో జరుగుతుంది. ‘తాజ్ మహల్’ యువతరం కలల సినిమా.నిజమైన ప్రేమకు నిలువుటద్దంలా వుంటుంది. ‘తాజ్ మహల్’ని అభిమానించనివారు ఎలా వుండరో, ఈ చిత్రాన్ని ఇష్టపడనివారూ అలానే వుండరు’ అని అన్నారు.
దర్శకుడు అరుణ్ సింగరాజు మాట్లాడుతూ- ‘ఈ చిత్రం శివాజీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుంది. కథ, కథనం ఈ చిత్రంలో ప్రత్యేకతలు. ఒక్క యువతనే కాకుండా, అన్ని తరగతుల వారినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. కోట, నాజర్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ,వేణుమాధవ్, సంగీత, ప్రగతి,కల్పన ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ : చంద్రు, మాటలు : గంగోత్రి శ్రీనివాస్.