Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
శివాజీ ప్రేమకథ ‘తాజ్‌మహల్‌’
     నటుడు శివాజీ నిర్మిస్తున్న చిత్రం 'తాజ్‌మహల్‌'. కన్నడంలో గత ఏడాది సూపర్‌హిట్‌ అయిన చిత్రాన్ని అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌పై అరుణ్‌ సింగరాజును దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి ప్రస్తుతం గ్రేడింగ్‌ వర్క్‌ జరుగుతోంది. రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డి.రామానాయుడు 'తాజ్‌మహల్‌' లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సురేష్‌ ప్రొడక్షన్స్‌లో 'తాజ్‌మహల్‌' నిర్మించాననీ, ఎంతో హిట్‌ అయిందనీ, ఈ చిత్రమూ అంత సక్సెస్‌ కావాలనీ ఆకాంక్షించారు. తాను ఈ చిత్రంలో చిన్న వేషం వేశాననీ చెప్పారు.

శివాజీ మాట్లాడుతూ- 'చిత్ర దర్శకుడు అరుణ్‌ సాప్ట్‌వేర్‌ రంగానికి చెందినవాడైనా చిత్రరంగంపై శ్రద్ధతో అమెరికాలో ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. నేను ఇంతకుముందు చేసిన 'ఇందుమతి' చిత్రానికి పనిచేశాడు. ఈ సినిమాకు కొత్తదర్శకుడు అయితే బాగుంటుందని అరుణ్‌ను పెట్టాం. చక్కని ప్రేమకథా చిత్రంగా ఒరిజినల్‌ వెర్షన్‌ ఏమాత్రం చెడిపోకుండా జాగ్రత్తగా డీల్‌ చేశాం' అని తెలిపారు. నవంబర్‌ 2న దాసరి చేతులమీదుగా ఆడియోను ఆవిష్కరిస్తున్నాం. అదేనెలలో సినిమాను విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.ఇంకా ఈ చిత్రలో కోటశ్రీనివాసరావు, జీవా, కల్పన తదితరులు నటిస్తున్నారు. సంగీతం:అభిమాన్‌, కెమెరా: వి. శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ బోయనపల్లి, నిర్మాత: శివాజీ సంతినేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌ సింగరాజు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com