ప్రపంచ ప్రఖ్యాత చిత్ర సంస్థ ‘వాల్ట్ డిస్నీ’ మరో అద్భుత సృష్టి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘ఘోస్ట్ రైడర్’గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ హీరో ‘నికోలస్ కేజ్’ తాజా చిత్రం ‘దిసార్సరర్ అప్రెంటిస్’
జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి ‘తాంత్రికుడు’ అనే పేరును నిర్ణయించారు.
ఇందులో తాంత్రిక గురువుగా నికోలస్ కేజ్ నటించారు. గతంలో రూపొందిన ‘ఘోస్ట్ రైడర్’ కంటే ఎన్నో మంత్ర తంత్ర విద్యలు
ప్రదర్శిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది నికోలస్ కేజ్ పాత్ర.
చిత్రంలో ప్రదర్శించిన తంత్ర విద్యలను మోడరన్ టెక్నాలజీ సహాయంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఈ జిమ్మిక్స్ ప్రేక్షకులను
ఆద్యంతం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయని ‘మల్టి డైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్స్’ అధినేత రజత్ పార్థసారధి తెలిపారు.
యాక్షన్, కామెడి, ఎడ్వంచర్ మూవీగా రూపొందిన దీనిలో నికోలస్ కేజ్ గత చిత్రాల కంటే ఇందులో ఆయన నటన ఎంతో వైవిధ్యంగా
రూపొందినదని, చిత్రం ఆద్యంతం ఉత్సుకను కలిగిస్తూ వినోదాన్ని పంచుతుందన్నారు మల్టిడైమన్షన్ జి.యం.పి.వాసు, రత్న
సెల్యులాయిడ్స్ జక్కం జవహర్ బాబు.
‘వాల్ట్డ డిస్నీ’ సంస్థ రూపొందించిన ఈ చిత్రంలో నికోలస్ కేజ్, జెబరూచల్, మోనిక బెలూచి, ఆల్ ఫ్రెడ్ మోలిన,
తెరిసాపామర్, టోచికెబ్బెనబెల్ వంటి హేమా హేమీలు నటించారు. ఈ ‘తాంత్రికుడు’ చిత్రానికి దర్శకత్వం : జాన్ టర్టర్ బూ
నిర్మాత : రజత్ పార్థసారథి.