ఫిలిం న్యూస్
 
 
 
 
అక్టోబర్ 14న 'తెలుగమ్మాయి'

వైష్ణవీ మూవీస్‌ నిర్మాత వానపల్లి బాబూరావు ఖర్చుకు వెనకాడకుండా ''తెలుగమ్మాయి'' చిత్ర నిర్మాణం చేశారు. ఏ మాత్రం కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని తయారు చేశారు దర్శకులు రాజావన్నెంరెడ్డి. బంగా రుతల్లి, కృష్ణవేణి, చిలకమ్మ చెప్పింది, దేవుళ్ళు వంటి లాంటి చిత్రాలు తీసిన అనుభవంతో చేగొండి హరిరా మజోగయ్య ఈ చిత్రానికిత సారథ్యం వహించారు. 'తెలుగమ్మాయి'' సినిమా ఒక పల్లెటూరి పిల్లకథ మాత్రమే అనుకుంటున్నారు కదూ! సినిమా మొదటి భాగం అంతా బాలత్రిపురసుందరి అనే పల్లెటూరి పిల్లకథే. ఈ సినిమాలో హీరో లేడని అనుకుంటున్నారు కదూ, ఒక్కడు కాదు 4గురు హీరోలున్నారు. లవ్‌స్టోరీ కాదనుకుంటున్నారు కదూ. హీరోయిన్‌, హీరోలు ఉండగా లవ్‌ఎఫైర్స్‌ లేకుండా ఎలా ఉంటాయండీ. సినిమాలో మొదటిభాగం అంతా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ట్రైన్‌లో నడిచిపోతుంది. హీరో, హీరోయిన్లు మధ్య సరదాగా, ఆటపాటలతో కవ్విస్తూ, నవ్విస్తూ, సరదాగా ప్రేక్షకులను అలరిస్తూ నడిచిపోతుంది. విలన్‌ లేకుండా ఏ కథ అయినా రక్త కట్టించడం కష్టం కదండి. ఈ సినిమాలో విలన్‌ని చూస్తేనే వణికిపోతారు. అతను ఎవరనుకున్నారు. ఎవరో కాదు షఫీ. ఇక మొదటి సగ భాగం హీరోయిన్‌, హీరోలు, విలన్‌ మధ్య జరిగే సన్నివేశాలైతే, రెండవ భాగంలో ఒక కొత్త క్యారెక్టరు ప్రవేశిస్తుంది. అనెవరో కాదు, డైనమిక్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సాయికుమార్‌, అక్కడి నుండి ఈ కథ ఒక మలుపు కాదు నాలుగైదు మలు పులు తిరుగుతూ చివరి వరకు ఊపిరాడకుండా సస్పెన్స్‌ కొనసాగుతుంది. ఇక కథ ముగింపే ఈ కథకు ఒక థ్రిల్‌. ‘‘అక్టోబర్‌ 14న మా ‘తెలుగమ్మాయి’ని రిలీజ్‌ చేస్తున్నాం. పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ప్రతి ఆడపడుచు చూసి తీరవలసిన చిత్రం. ఆడవాళ్ళ మీద మాకు నమ్మకముంది. ఆడియన్స్‌ మీద నమ్మకముంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడండి. మీకు నచ్చి తీరుతుంది'' అని అన్నారు దర్శకనిర్మాతలు.