Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘తకిట తకిట’ పూర్తి
      డౌన్ టౌన్ ఫిలింస్ పతాకంపై భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న ‘తకిట తకిట’ పూర్తయ్యింది. మే చివరిలో పాటలు, జూన్లో చిత్రం విడుదలవుతాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి నాను మాట్లాడుతూ- ‘పెద్ద నిర్మాతలకి ఈ స్క్రిప్ట్ చెప్పినా వర్కవుట్ కాలేదు. నా ఈ కల నిజం కావడానికి భరత్ ఠాకూర్ కారకుడు. ప్రేమ పేరుతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఇందులో చెప్పాం’ అని అన్నారు.

నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ- ‘కొత్త వారితో చేయడం కోసం దేశమంతటా ఆర్టిస్టుల కోసం వెతికాం. వారికి ట్రైనింగ్ ఇచ్చాం. పూర్తి స్క్రిప్టుతో అన్ని విధాలా బాగా వచ్చేలా, బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి సినిమా నిర్మించాం’ అని అన్నారు.

భూమిక మాట్లాడుతూ- ‘వినోదాత్మక యూత్ కథాంశంతో మనసుకి నచ్చేలా దీన్ని రూపొందించాడు. నాకు తెలుగు సినిమా పరిశ్రమ చాలా ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమకు నేను చిన్న బహుమతిగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను. ఇందులో సెలబ్రిటీగా నేను ఓ పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర చెప్పే ఓ డైలాగ్ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’ అని అన్నారు.

అనూష్క మాట్లాడుతూ - ‘ఇది నా కుటుంబ సంస్థ. వీరు చేసే ఏ చిత్రంలో అయినా, ఏమిటని అడగకుండా పని చేస్తాను. ఇందులో వినోదంతోపాటు మెసేజ్ కూడా వుంటుంద’ని అన్నారు.

అంతా కొత్తవాళ్ళు నటించిన ఈ చిత్రంలో నాగార్జున, అనూష్క, భూమిక ప్రత్యేక పాత్రలు పోషించారు. రచన: కోన వెంకట్, సంభాషణలు : బి.వి.ఎస్.రవి, సంగీతం: బొబొ శశి, ఫొటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బెక్కెం వేణుగోపాల్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com