Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ఉపేంద్రతో నయనతార
      విభిన్నమైన కథాంశాలతో... వినూత్నమైన పాత్ర చిత్రణలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు, దర్శకుడు ఉపేంద్ర. ఆయన పదేళ్ల కిందట రూపొందించిన 'ఉపేంద్ర' చిత్రం కన్నడంలోనూ, తెలుగులోనూ విజయవంతమైంది. ఆ తరవాత ఆయన దర్శకత్వం వైపు దృష్టి సారించలేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని రాక్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నయనతార కథానాయిక. ఇటీవలే బెంగళూరులో చిత్రీకరణ మొదలైంది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ''ఉపేంద్ర దర్శకత్వం అనగానే వైవిధ్యమైన అంశాలుంటాయని భావించడం సహజం. అందుకు తగ్గ రీతిలోనే ఈ సినిమా ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తామ''న్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com