Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సాయిరామ్‌ 'వాడే కావాలి'
     సాయిరామ్‌శంకర్‌, సుహాసి జంటగా నటించిన చిత్రం 'వాడే కావాలి'. రాజేంద్రదర్శన్‌ దర్శకత్వంలో వీరేంద్రబాబు, రఘునాథ్‌ సోగి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎస్వీఆర్‌ మీడియా ప్రై.లిమిటెడ్‌ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్వీఆర్‌ మీడియా సీఈవో శోభారాణి మాట్లాడుతూ- "దశావతారం, సూర్య సన్నాఫ్‌కృష్ణన్‌, నీ వల్లే నీవల్లే లాంటి చిత్రాలను అందించిన ఎస్వీఆర్‌ మీడియా నుంచి వస్తోన్న మరో మంచి సినిమా 'వాడే కావాలి'.

ఆర్పీ పట్నాయక్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. దాంతో నిర్మాతలను కలిశాను. విజువల్‌గా కూడా పాటలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదో యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సాయిరామ్‌లోని ఫైర్‌ని తెలిపే సినిమా ఇది. 'బంపర్‌ ఆఫర్‌' తర్వాత ఆయన అందుకోనున్న మరో విజయం ఇది. డిసెంబరులో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. "ఇందులో ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

అన్ని వర్గాల వారికీ 'వాడే కావాలి' నచ్చుతుంది' అని నిర్మాతల్లో ఒకరైన రఘునాథ్‌ సోగి చెప్పారు. నేటి ప్రేమికులు ఎదుర్కొనే సమస్యలకు ఈ సినిమా ఒక దర్పణంలా ఉంటుంది అని దర్శకుడు అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com