‘మార్షల్ ఆర్ట్స్’లో బ్రూస్లీ, జాకీ చాన్, జెట్ లీ’ల వారసుడు ‘టోనీ జా’ నటించిన తాజా చిత్రం ‘ఆంగ్ బాక్-3’. తెలుగులో ‘వజ్రబలుడు’గా
ఏప్రిల్ 8న విడుదలవుతోంది. మల్టీ డైమన్షన్ సంస్థ ఇక్కడ అందిస్తోంది. ప్రచారచిత్రాల ఆవిష్కరణ సందర్భంగా మల్టీ డైమన్షన్
ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధి పి.వాసు మాట్లాడుతూ ‘తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దేశమంతటా మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం. ‘ది
ఫైనల్ వారియర్’గా ఇంగ్లీషులో, ‘వజ్రబలుడు’గా తెలుగులో విడుదలవుతోంది. జాకీచాన్, జెట్లీ తర్వాత యువతరంలో అంతటి
పేరుప్రఖ్యాతులున్న యాక్షన్ స్టార్ టోనీ జా. ఈ సిరీస్‌లో రెండోభాగం కూడా తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించింది.
జా భీకర పోరాటాలు, మార్షల్ ఆర్ట్‌స మనవారిని విశేషంగా అలరించాయి. డూప్ లేని ఫైట్స్ మతిపోగొట్టాయి. అవి చూసి ఇక్కడివారు కూడా
అనుకరించడానికి ప్రయత్నించారు. ‘ఆంగ్‌బాక్’ సిరీస్‌లో వస్తున్న ఈ 3వ భాగం యాక్షన్ ప్రియులకు సిసలైన సినిమా’ అన్నారు. మల్టీ
డైమన్షన్ సంస్థ సీనియర్ మేనేజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఏప్రిల్ 8న రాష్టవ్య్రాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు. డాన్ భుపాంగ్, కాథరిన్
ఏక్తావక్తుల్ ఇతర ప్రధానపాత్రలు పోషించగా, టోనీ జా స్వీయదర్శకత్వంలో రూపొందించారు. తెలుగు వెర్షన్ సమర్పకుడు: రజత్ పార్థసారథి.
|