Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
చైతన్య - అక్ష కాంబినేషన్‌
     వందన ఆర్ట్స్‌ పతాకంపై వీరప్రసాద్‌ నీలం దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం అయ్యింది. 'నిన్ను కలిశాక' ఫేమ్‌ చైతన్య, 'యువత' ఫేమ్‌ అక్ష ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తొలిషాట్‌కు పూరిజగన్నాధ్‌ క్లాప్‌ కొడితే, బెల్లంకొండ సురేష్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు వీరప్రసాద్‌ మాట్లాడుతూ - కాలేజి బ్యాక్‌ డ్రాప్‌లో సాగే యూత్‌ లవ్‌ స్టోరీతో ఈ చిత్రం నిర్మిస్తున్నాం. డిసెంబర్‌ 7 నుండి షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది - అని చెప్పారు.

నిర్మాత శ్రీకాంత్‌ మాట్లాడుతూ - వీరప్రసాద్‌ కథ నచ్చింది. మంచి ఎంటర్‌టైనర్‌గా చేసేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. మంచి టీమ్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేస్తాం - అని అన్నారు. చైతన్య మాట్లాడుతూ - 'నిన్ను కలిశాక', 'స్నేహగీతం' తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను. ఇందులో లక్కీగర్ల్‌ అక్ష నా కాంబినేషన్‌లో చేస్తోంది. ఆమె అదృష్టం నాకూ దక్కాలని ఆశిస్తున్నాను. ఆసక్తికరమైన ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది -అని అన్నారు. అక్ష మాట్లాడుతూ - తొలిసారి పూర్తి ప్రేమకథా చిత్రంలో చేస్తున్నాను. చైతన్యతో నా కాంబినేషన్‌ మంచి ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాను- అని అన్నారు. కెమేరామెన్‌ విందా మాట్లాడుతూ - కామెడీతో కూడిన రొమాంటిక్‌ కథతో మంచి ఎంటర్‌టైనర్‌గా దీన్ని చేస్తున్నాం. చైతన్య, అక్ష మంచి జంటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు - అని అన్నారు. ఈ చిత్రానికి విక్రమ్‌ రాజ్‌ మాటలు, జీవన థామస్‌ సంగీతం అందిస్తున్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com