వంశీకృష్ణ హీరోగా శ్రీను గోగినేని దర్శకుడిగా ముత్యాల సత్యకుమార్ నిర్మిస్తున్న ‘వంకరోడు’ సినిమా వివరాలను వెల్లడించడానికి ఎఫ్.ఎన్.సి.సి.లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు
చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీను గోగినేని, నిర్మాత ఎం.ఎస్.కుమార్, రాజేష్, లక్కిశెట్టి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీను గోగినేని మాట్లాడుతూ- ‘ఒక మంచి సినిమా తీయాలనే ఈ చిత్రకథను ఎంచుకున్నాము. ఈ చిత్రకథలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు అన్నీ వుంటాయి.
లవ్ యాక్షన్ సెంటిమెంట్స్ ఈ సినిమాలో మెండుగా వున్నాయి. నిర్మాత చక్కటి సహకారాన్ని అందజేశాడు’ అని అన్నారు.
నిర్మాత ముత్యాల సత్యకుమార్ మాట్లాడుతూ- ‘ఐదు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాము. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగ్ జరిగింది. పూర్తిస్థాయి వినోద
భరితంగా రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు పాతికమంది కమెడియన్స్ వున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలను బ్యాంకాక్ లో తీయడం జరిగింది. వచ్చే నెల రెండవ వారంలో
సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’ అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో మంజులిక, కల్పిక, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు.
|