Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘వారెవా’ గౌతమ్
     ప్రముఖ హాస్యనటులు డాక్టర్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారెవా’. శాంభవి ఇందులో హీరోయిన్. కళ్యాణ్ మంతెన దర్శకత్వంలో మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కళ్యాణ్ మంతెన మాట్లడుతూ- ‘వినోదానికి, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. గౌతమ్ పాత్ర చిత్రణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అని చెప్పారు.

నిర్మాత మహేశ్వరరావు మాట్లాడుతూ- ‘తొలి షెడ్యూల్ లో ఓ పాట చేశాం. మాస్టర్ నిక్సన్ నేతృత్వంలో కేథార్ నాథ్ రాసిన పాటను గౌతమ్, శాంభవిపై చిత్రీకరించాం. రెండో షెడ్యూల్ మే 5నుంచి ఏకధాటిగా హైదరాబాద్, పరిసరాల్లో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాం. మూడో షెడ్యూల్ జూన్ 5నుంచి వైజాగ్ లో చేస్తాం’ అని తెలిపారు.

బ్రహ్మానందం, దేవన్, సయ్యాజీ షిండే, జీవా, వేణుమాధవ్, మాస్టర్ భరత్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, ప్రగతి, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మహేష్ శంకర్, సాహిత్యం : వేటూరి, సినిమాటోగ్రీఫీ : సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయ్, సహ నిర్మాతలు: సిహెచ్.వెంకటరెడ్డి, జానకిరామ్ (జాని), సమర్పణ : శ్రీమతి తులసి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com