సిక్స్‌ప్యాక్ బాడీతో... సంప్రదాయబద్ధంగా పంచె, తలపాగా ధరించి... బుగ్గన చుక్కతో... కళ్యాణ తిలకం దిద్దుకుని పీటలపై తలవంచుకుని కూర్చున్న 'వరుడు'గా అల్లు అర్జున్‌ని చూస్తుంటే... ఎవరైనా నవ్యానుభూతికి లోనుకాక తప్పదు. దర్శకుడు గుణశేఖర్ 'వరుడు' చిత్రంలో అల్లు అర్జున్‌ని అలా చూపించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని గుణశేఖర్ చెబుతున్నారు.
ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -"సినిమా చాలా బాగా వస్తోంది. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్‌గా ఓ అద్భుతమైన పాత్ర చేస్తున్నారు. అంతేకాక వందకు పైగా కుటుంబాలు ఈ వరుడు చిత్రంలో నటించడం విశేషం. సాంకేతిక పరంగా కూడా అత్యున్నత స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. వేటూరి సాహిత్యం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఆ పాటను మార్చి మొదటి వారంలో చిత్రీకరిస్తాం' అని తెలిపారు.
ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ఉంటుంది. వాణిజ్య అంశాల మేలుకలయికగా వస్తున్న ఈ చిత్రం తప్పక అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. మార్చి 26న చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అని చెప్పారు నిర్మాత డీవీవీ దానయ్య. సుహాసిని, నరేష్, అశిష్ విద్యార్థి, సయాజీ షిండే, సింగీతం శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, డా.బ్రహ్మానందం, బ్రహ్మాజి, వినయ్‌ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ఆంథోని, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూనివర్సల్ మీడియా.