Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
విష్ణు 'వస్తాడు నా రాజు'
     మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వస్తాడు నా రాజు'. తాప్సి కథానాయిక. 24 ఫ్రేమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో వినూత్నంగా జరిగింది. ఇందుకోసం ఐమాక్స్‌ థియేటర్‌ దగ్గర 60 అడుగుల ఫ్లెక్సీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విష్ణు తీగల సాయంతో గాలిలో గిరికీలుకొడుతూ ఫ్లెక్సీ దగ్గరకు చేరుకొన్నారు.అక్కడి నుంచి దూకుతూ లోగో ఆవిష్కరించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విష్ణు మాట్లాడుతూ ''వస్తాడు నా రాజు కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. దానికి తగ్గట్టే ఇలా వినూత్నంగా లోగోని ఆవిష్కరించాం. ఈ సినిమాని పూర్తిగా అత్యాధునిక రెడ్‌ కెమెరాతో చిత్రీకరించాం. ఓ వాణిజ్య హంగులున్న చిత్రాన్ని రెడ్‌ కెమెరాతో తీయడం తెలుగులో ఇదే మొదటిసారి. వెనిస్‌, ఆస్ట్రియాల్లో పాటల్ని తెరకెక్కించాం. డిసెంబరు 10న విజయవాడలో పాటల్ని విడుదల చేస్తామ''న్నారు. దర్శకుడు చెబుతూ ''ప్రతి అమ్మాయికీ ఓ కల ఉంటుంది. తన ప్రియుడు రాజులా వస్తాడని. మా సినిమాలో ఆ కలను కొత్త కోణంలో చూపించాం. మాస్‌, వినోదం మేళవించిన ప్రేమకథ ఇది. మణిశర్మ అందించిన స్వరాలు ఆకట్టుకొంటాయ''న్నారు. ఈ కార్యక్రమంలో తాప్సి, మాటల రచయిత శ్రీధర్‌ కూడా పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com