ఫిలిం న్యూస్
 
 
 
 
నిఖిల్ 'వీడు తేడా'
హ్యాపీడేస్‌’, ‘యువత’ చిత్రాల కథానాయకుడు నిఖిల్‌ హీరోగా ‘వీడు తేడా’ అనే చిత్రం మొదలయ్యింది. ‘కొత్త బంగారులోకం’ చిత్రంలో వార్డెన్‌ పాత్ర పోషించిన బి.చిన్నికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రకాష్‌ నిర్మిస్తున్నారు.నిఖిల్‌తో రూపొందిన ‘యువత’ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ప్రకాష్‌ ఈ చిత్రంతో సోలో ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు.చక్రి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. పూజాబోస్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి డా డి.రామానాయుడు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు.‘మిరపకాయ్‌’ నిర్మాత రమేష్‌ పుప్పాల గౌరవ దర్శకత్వం వహించారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘ఇది నేను హీరోగా నటిస్తున్న 7 వ చిత్రం. చిన్నికృష్ణ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌ భలే గమ్మత్తుగా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అన్నారు.

నిర్మాత ప్రకాష్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణం ఎంత రిస్కో నాకు బాగా తెలుసు.అయితే చిన్నికృష్ణ చెప్పిన కథపై కుదిరిన నమ్మకంతో, రిస్క్‌ లేదనిపించాక నిర్మాణంలోకి దిగాను’ అన్నారు.