'ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన, ఆసక్తి ఉన్న కథానాయకుడు వెంకటేష్. 'వివేకానందస్వామి బోధనలు నన్నెంతో ప్రభావితం చేశాయి' అని తరచూ చెబుతుంటారు. ఎప్పటికైనా వివేకానందుని పాత్రలో కనిపించాలనేది వెంకటేష్ ఆలోచన. అది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. అయితే వెండి తెరలో కాదు. బుల్లి తెర మీద. నీలకంఠ దర్శకత్వంలో రూపొందించే ఓ ధారావాహికలో వెంకటేష్ - స్వామి వివేకానంద పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో మొత్తం 25 భాగాలుంటాయని తెలిసింది. ఈ ధారావాహికను తెలుగుతోపాటు మిగతా భాషల్లోకీ అనువదించే అవకాశాలూ ఉన్నాయి. 'వివేకానందుడి చరిత్ర ఆధారంగా ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఆయన బోధనల్ని విస్తృతంగా చర్చించాలంటే ధారావాహికలే ఉత్తమ మార్గం' అని వెంకటేష్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఇందుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి.
|