ఫిలిం న్యూస్
 
 
 
 
22 నుండి వెంకీ - త్రిష చిత్రం
విక్టరీ వెంకటేష్‌ హీరోగా త్రిష హీరోయిన్‌గా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సమర్పణలో శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.3 చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే 22న వైజాగ్‌లో ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ''నాగవల్లి తర్వాత వెంకటేష్‌తో చేస్తున్న మరో భారీ చిత్రమిది. వెంకటేష్‌, త్రిష కాంబినేషన్‌లో మూడో సినిమాగా వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే 22న ప్రారంభిస్తున్నాం. ఆల్‌మోస్ట్‌ సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్లాన్‌ చేశాం. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది మరో విభిన్న చిత్రమవుతుంది'' అన్నారు.

వెంకటేష్‌, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, డా|| బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్‌, చంద్రమోహన్‌, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: కోన వెంకట్‌, డాన్స్‌: రాజు-సుందరం, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కిషోర్‌, కో డైరెక్టర్‌: ఎస్‌. సురేష్‌కుమార్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: ఎస్‌.థమన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బి.మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ సురేష్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని.