ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వేణు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కమలిని ముఖర్జీ
నాయిక. జి.ఈశ్వర్ దర్శకుడు. పి.వి.శ్యామ్‌ప్రసాద్ నిర్మాత. మలయాళంలో విజయవంతమైన
'సి.ఐ.డి.మూస' దీనికి ఆధారం. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రంముహూర్తపు సన్నివేశానికి
ఇ.వి.వి.సత్యనారాయణ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా
సాగుతుంది. కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వాణిజ్యపరమైన అంశాలు పుష్కలంగా
ఉంటాయ''న్నారు. ''మా సంస్థ స్వల్ప విరామం తరవాత నిర్మిస్తున్న చిత్రమిది. అందర్నీ
అలరించేలా ఉంటాయి కథ, కథనాలు. జులై 1 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తామ''న్నారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎమ్మెస్‌నారాయణ, గిరిబాబు, జయప్రకాశ్‌రెడ్డి, అలీ, ఎల్బీశ్రీరాం,
రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: కె.ప్రసాద్,
సహనిర్మాతలు: మీడియా9 ఎంటర్‌టైన్‌మెంట్స్, పి.వి.నాగేశ్వరరావు.
|