ఫిలిం న్యూస్
 
 
 
 
వైభవ్‌ కొత్త సినిమా

దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. 'ఏకవీర' ఫేమ్ అర్చనాకవి హీరోయిన్గా నటిస్తోంది. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ క్రియేషన్స్, శ్రీచక్ర సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చినబాబు ఎ.రాజా బాలాజీ ప్రసాద్ నిర్మాతలు. ఆల్ఫాన్స్ దర్శకుడు.

ఈ చిత్రం గురించి వైభవ్ మాట్లాడుతూ..'తెలుగు, తమిళభాషల్లో రూపొందిస్తున్నాం. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ శైలిలో కొత్త స్క్రీన్ప్లే, కొత్త ఫార్మెట్ ఉన్న కథ దొరికింది. దర్శకుడు కొత్తవాడయినా తను చేసిన డాక్యుమెంటరీలు చూసి ఇంప్రెస్ అయ్యాం. కథ గురించి చెప్పాలంటే...ఫ్యామిలీ ప్రాబ్లమ్, విలన్ ప్రాబ్లమ్, హీరోయిన్ ప్రాబ్లమ్ ఈ మూడింటిని ఎలా ఫేస్ చేశాడనేది కథ. ఈ చిత్రం 'ఢిల్లీ బెల్లీ' తరహాలో ఉంటుంది. తెలుగులో కొత్త ప్రయోగం అవుతుంది' అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...'ఈనెల 10నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా షూటింగ్ కొనసాగిస్తాం. ఏప్రిల్లో పోస్ట్ప్రొడక్షన్స్, మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నా' అని అన్నారు.

రాజ్ జకారియా మాట్లాడుతూ...'తెలుగులో మొదటిసారిగా నటిస్తున్నా. చక్కటి కమర్షియల్ సినిమా ఇది' అన్నారు. తాను తెలుగులో తొలిసారిగా నటిస్తున్నాననీ, ఆర్డినరీ లవర్గా తన పాత్ర ఉంటుందనీ అర్చనాకవి తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: మహేస్ ముత్తుస్వామి.