ఫిలిం న్యూస్
 
 
 
 
శ్రీకాంత్ 'విరోధి'
శ్రీకాంత్ కథానాయకుడిగా మేక మీడియా పతాకంపై నీలకంఠ దర్శకుడిగా నిర్మించిన ‘విరోధి’ సినిమా ప్రెస్ మీట్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో నీలకంఠ, అనీల్, శ్రీకాంత్, శివాజీ రాజా, కృష్ణవంశీ, అజయ్, పోసాని కృష్ణమురళి, ఆర్.పి.పట్నాయక్ తదితరలు పాల్గొన్నారు. ‘విరోధి’ లోగోను కృష్ణవంశీ ఆవిష్కరించారు. శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.

కృష్ణవంశీ మాట్లాడుతూ - శ్రీకాంత్ కు నాకు ఉన్న స్నేహం తెలిసిందే. మనకున్న అతికొద్ది మంచి దర్శకుల్లో నీలకంఠ ఒకరు. అతను మీనింగ్ ఫుల్ సినిమాలు చేస్తాడు. అతనితో శ్రీకాంత్ కథానాయకుడిగా వారి తమ్ముడు నిర్మాతగా సినిమా చేయడం ఆనందంగా ఉంది.

అజయ్ మాట్లాడుతూ - శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నీలకంఠగారి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

నీలకంఠ మాట్లాడుతూ - ఈ సినిమా చేయడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా నా మైండ్ లో చాలా కాలంగా మెదులుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కథ అవసరం అనిపించింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశాము. కాని ఇందులో నక్సలిజం ఉండదు. అందరం టీమ్ వర్క్ తో సినిమా చేశాము అన్నారు.

అనిల్ మాట్లాడుతూ - శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లోగో లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిన్నటికి సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమాను ఎక్కువగా ఔట్ డోర్ లో చేశాము. ఆర్టిస్టులందరూ బాగా సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకు మంచి సంగీతం, ఫోటోగ్రఫి కుదిరింది అన్నారు.

ఆర్.పి.పట్నాయక్ మట్లాడుతూ - నీలకంఠగారు ఈ సినిమాలో ఒక పాత్ర ఉంది చేస్తారా అని అడిగినపుడు. నేను చేయగలనా ఆలోచించండి అన్నాను. అయితే సంగీతం చేయమని అన్నారు. ఆయన చెప్పిన విధంగా సంగీతాన్ని అందించారు. పాటలు చిత్రీకరిస్తున్నప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సినిమాను ఔట్ డోర్ లో కష్టపడి చేశారు. చాలా కష్టమైప లొకేషన్స్ లో ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ - నా తొలి సినిమా పీపుల్స్ ఎన్ కౌంటర్. నా 20వ పుట్టిన రోజు నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ సినిమా రావడం యాధృచ్ఛికం. ఈ సినిమాలో నేను తెలివైన జర్నలిస్టుగా చేస్తున్నాను. నీలకంఠ గారు మంచి సబ్జెక్ట్ తో వచ్చాడు. ఈ సినిమా కథ నా తమ్మడికి నచ్చడంతో రెండు నెలల్లో సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా విడుదలవుతుంటే నా తమ్ముడు ఏమౌతాడా అనే టెన్షన్ ఉంది. అందరి సినిమాలు ఎలా చేశానో ఈ సినిమా కూడా అలాగే చేశాను. అతను మంచి నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను. కెమెరామెన్ రామ్ అద్భుతమైన కెమెరామెన్.

ఈ కార్యక్రమంలో కమల్ కామరాజ్, పోసాని కృష్ణమురళి, శ్రీరమ్య, శివాజీ రాజా తదితరలు మాట్లాడారు.