ఫిలిం న్యూస్
 
 
 
 
లక్స్ డ్రీం గర్ల్ కాంటెస్ట్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, స్ప్రింట్ టెలీఫిలిం లిమిటెడ్ వారు ‘లక్స్ డ్రీమ్ గర్ల్ కాంటెస్ట్’ జరుగనుంది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన అమ్మాయికి విష్ణు హీరోగా రూపొందనున్న సినిమాలో అవకాశం ఇవ్వనున్నారు. ఈ కాంటెస్ట్ ఆవిష్కరణ కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో విష్ణు, నికిత, రాజేంద్రప్రసాద్, మధుకర్, యస్.గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోకల్ ఛానల్ ప్రింట్ మీడియా సియిఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, స్ప్రింట్ టెలీఫిలిం లిమిటెడ్ వారు మెగా రియాలిటీ షో ‘లక్స్ డ్రీమ్ గర్ల్ కాంటెస్ట్’ను మూడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నాము. ఏప్రిల్ 16 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. 16 ఎపిసోడ్ల ఈ ఈవెంట్ కు ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో అథితి సినిమా పరిశ్రమ నుండి వస్తారు. ఏప్రిల్ ఒకటి నుండి ఈ సెలక్షన్స్ విజయవాడ మురళీ పార్క్ హోటల్, వైజాగ్ దస్ పల్లా, హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరుగుతాయి. ఈ సెలక్షన్స్ లో నికిత, యస్.గోపాల్ రెడ్డి, దర్శకుడు మధుకర్ లు పాల్గొంటారు అన్నారు.

హేమంత్ మధుకర్ మాట్లాడుతూ - హీరోయిన్ ను వెతకడం చాలా కష్టమైన విషయం. ఒక మంచి అమ్మాయిని వెతుక్కోవడంలో ఈ పద్ధతి బాగుంటుందని ఈ విధానాన్ని ఎంచుకున్నాము అన్నారు.

విష్ణు మాట్లాడుతూ - ఈ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పినపుడు బాగానే అనిపించింది. అయితే చాలా మంది చేసి ఉన్నారు కదా మనది ఎలా డిఫరెంట్ గా ఉంటుంది అని అడిగితే. ఈ విధానంలో చేస్తే బాగుంటుంది అని వివరించారు. ఈ కార్యక్రమానికి నికిత హోస్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ షోలో పాల్గొంటున్న నికిత, స్నిగ్దకు, యస్.గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఎంతో మంది అందమైన అమ్మాయిలతో యాక్ట్ చేశాను. కాని తెలుగు హీరోయిన్ తో యాక్ట్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా అందమైన అమ్మాయిలు కనిపించినపుడు ఇలాంటి వారు సినిమాల్లోకి రావడం లేదు అనిపిస్తుంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అనిపించింది. అలాంటి అమ్మాయిలకు ఇది మంచి వేదిక. ఈ షో భారత దేశంలోనే ఎక్కవ ఖరీదు అయింది. దాదాపు 5.50 కోట్లతో దీన్ని చేస్తున్నారు. ఈ కాంటెస్ట్ లో గెలుపొందే అమ్మాయి అదృష్టవంతురాలు. కేవలం తెలుగు అమ్మాయిలే కాకుండా మన దేశంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే మన తెలుగు వారు అయితే బాగుంటుందనే నా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో ఆడియన్స్ పాత్ర కీలకం అన్నారు.