‘‘జీవితమే ఒక వైకుంఠపాళి. ఇక్కడ నిచ్చెనలే కాదు. మింగేసే పాములు కూడా ఉంటాయి. ‘‘జీవితమే ఒక వైకుంఠపాళి. ఇక్కడ నిచ్చెనలే కాదు. మింగేసే పాములు కూడా ఉంటాయి. ఈ వినూత్న కథాంశంతో ‘వైకుంఠపాళి’ సినిమా రూపొందింది. బాలీవుడ్ తరహాలో కమర్షియల్ ప్రయోగంగా ఈ సినిమా రూపొందింది’’ అని కృష్ణుడు చెప్పారు. ఆయన హీరోగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో హరేరామ హరేకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భువనేశ్వర మారం, సత్యదీప్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైకుంఠపాళి’.
తషుకౌశిక్ ఇందులో నాయిక. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కొన్ని విచిత్రమైన సంఘటనలతో కూడుకున్న కథ ఇది. ఇలాంటి సంఘటనలు ఎవ్వరికీ జరగవు. కానీ తెరపై చూస్తే అలా జరిగితే బాగుండుననిపించేలా ఉంటుంది.
ఈ నెల 20న సినిమా విడుదల కానుంది’’ అని తెలిపారు. ఇందులో తనది విభిన్న తరహా పాత్ర అని, తప్పనిసరిగా విజయం సాధిస్తుందని రణధీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా వర్షవర్థన్, జవహర్ రెడ్డి, అవినాష్ మాట్లాడారు.