జిడిఆర్ మీడియా లిమిటెడ్ సమర్పణలో జె.పి.ఫిలిమ్స్ పతాకంపై ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార-విజయ్ జంటగా జి.ఉషారాణి
నిర్మించిన ‘యమకంత్రి’ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొంది విడుదలైన ఈ చిత్రం
ఆడియోకు మంచి స్పందన వస్తోందని నిర్మాత ఉషారాణి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్రం విడుదలను పురస్కరించుకుని ఏర్పాటు
చేసిన పాత్రికేయుల సమావేశంలో జెపి ఫిలింస్ అధినేత జె.పి, ఈ చిత్రానికి గీతాలందించిన చంద్రబోస్.
సాహితిలతోపాటు ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ, సాగర్, ‘అహ నా పెళ్లంట’ ఫేమ్ యువ దర్శకుడు వీరభద్రమ్ పాల్గొని చిత్ర
విశేషాలు వెల్లడించారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘నయనతార, ప్రకాష్‌రాజ్, ముమైత్‌ఖాన్, ఖుష్బు వంటి ప్రముఖ
నటీనటులు నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయం’ అన్నారు. గీత రచయితలు చంద్రబోస్, సాహితి మాట్లాడుతూ..
‘యమకంత్రి’ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ స్వర సారధ్యంలో గీత రచన చేయడం ఆనందాన్నిచ్చింది’ అన్నారు. సీనియర్ దర్శకనిర్మాత
సాగర్, యువదర్శకుడు వీరభద్రమ్ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగించారు. నిర్మా త జె.పి మాట్లాడుతూ.. ‘దేవిశ్రీప్రసాద్ సంగీత
సారధ్యంలో రూపొంది, కోయల్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు చా లా మంచి స్పందన వస్తోంది. అ న్ని కార్యక్రమాలు పూర్తి చేసి
మే 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
|