యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా ‘ఘర్షణ’ ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఏ మాయ చేసావె’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ- ‘ఇది అందమైన లవ్ స్టోరీ. సినిమా చూసిన ప్రతి ఆడియన్ కి ఒక చక్కని అనుభూతిని కలిగించే చిత్రమిది. నాకెంతో ఇష్టమైన దర్శకుడు గౌతమ్ మీనన్ గారితో వర్క్ చేయడం సంతోషాన్ని కలిగించింది. ఇటీవల విడుదలైన ఆడియోచాలా పెద్ద హిట్ అయ్యింది. నేను నటించిన రెండో చిత్రానికే ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ గారు సంగీతం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆడియోలాగే సినిమాని కూడా ప్రేక్షకులు, అభిమానులు పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను‘ అన్నారు.
నిర్మాత సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ- ‘నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ గారి దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన లవ్ స్టోరీ ఇది. ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీకి రెహమాన్ గారి సంగీతం కూడా తోడైంది. ఇప్పటికే ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ప్రతిచోటా మా చిత్రంలోని పాటలు వినిపిస్తున్నాయి. ఇంత మంచి కాంబినేషన్లో ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా వుంది. అందర్నీ అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటూనే ఒక చక్కని ప్రేమకథా చిత్రంగా గౌతమ్ మీనన్ గారు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నాగచైతన్య సరసన సమంత నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మీ, సంజయ్ స్వరూప్, సుధీర్, త్రిష అలెక్స్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, పాటలు: అనంతశ్రీరామ్, మాటలు: ఉమర్జీ అనురాధ, ఫొటోగ్రఫీ: మనోజ్ పరమహంస, కళ: రాజీవన్, ఫైట్స్: సెల్వ, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, డాన్స్ : ఫ్లెక్సి (లండన్), కార్ల్ లాన్ షన్(యుఎస్ఎ), డైరెక్షన్ డిపార్ట్మెంట్ : రేవతి, నాయుడు వంశీ, రమేష్ దేశిన, మేఘన కార్తీక్, డి.సత్య, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రాజు, వెంకటరత్నం ఎస్., ప్రొడక్షన్ మేనేజర్స్: శివ, జేమ్స్, సమర్పణ: సూపర్ స్టార్ కృష్ణ, నిర్మాణం : ఇందిరా ప్రొడక్షన్స్, నిర్మాత: సంజయ్ స్వరూప్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గౌతమ్ మీనన్.