Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
దాసరి 'యంగ్‌ ఇండియా'
     దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం 'యంగ్‌ ఇండియా'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. దాసరి పద్మ సమర్పిస్తున్నారు. రామకృష్ణప్రసాద్‌ నిర్మాత. సిరి మీడియా ప్రై. లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు క్లాప్‌నిచ్చారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దాసరి నారాయణరావుమాట్లాడుతూ ''మన దేశంలోని మానవ వనరులను అమెరికా, యు.కె.లు బాగా ఉపయోగించుకుంటున్నాయి. మన యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకూడదు. దేశ భవిష్యత్తుకు దిక్సూచీలు కావాలి. కొత్తవారికోసం ప్రకటనలివ్వగానే 22వేల దరఖాస్తులందాయి. 81 మందిని మేం ఎంపిక చేశాం. రెండు నెలల పాటు వాళ్ళకు నటనలో తర్ఫీదునిచ్చాం. ఆరుగురు నాయకులు, నాయికలు ఉంటారు. తెలుగు మాట్లాడే తెలుగు నాయికలు దొరకట్లేదంటున్న వారికి మా సినిమా ఓ సమాధానమవుతుంద''ని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ''వరుసగా 60 రోజులు చిత్రీకరిస్తాం. హైదరాబాద్‌, విశాఖపట్టణం, ముంబైల్లో షూటింగ్‌ ఉంటుంది. మొత్తం 6 పాటలుంటాయ''ని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: సీహెచ్‌ రమణరాజు, కూర్పు: గౌతంరాజు, కళ: బి.వెంకటేశ్వరరావు, ఫైట్స్‌: రాఖీ రాజేష్‌, రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: జి.జగదీష్‌చంద్రప్రసాద్‌, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: దాసరి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com