విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న ‘యుద్ధం’ రామానాయుడు స్టూడియోలో
ప్రారంభమైంది. ‘ఎవరితోనైనా’ అనేది ఉపశీర్షిక. నట్టి లక్ష్మీ కరుణ నిర్మాణ సారధ్యంలో నట్టి క్రాంతి
సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో తరుణ్ హీరోగా నటిస్తుండగా, శ్రీహరి ఓ ముఖ్యపాత్ర
పోషిస్తున్నారు. యామి అనే భామ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆశిష్ విద్యార్ధి, అలీ, వేణుమాధవ్, రావు రమేష్ ఇతర
ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న డా. దాసరి
నారాయణరావు క్లాప్‌నివ్వగా, డా. డి.రామానాయుడు కెమెరా స్విచ్చాన్ చేసారు. డా శ్రీహరి
దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం దాసరి మాట్లాడుతూ.. చాలా చిన్న
స్థాయి నుంచి నిర్మాత స్థాయికి ఎదిగిన నట్టికుమార్ నిర్మిస్తున్న ఈ 60 వ చిత్రం 100 రోజుల
చిత్రం కావాలని ఆశీర్వదించారు. రామానాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికి 60 చిత్రాలను
నిర్మించిన నట్టికుమార్ వందకు పైగా నిర్మించాలని అభిలషించారు. నిర్మాత నట్టికుమార్
మాట్లాడుతూ.. మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం.
ఏప్రిల్‌లో 300 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.ఈ చిత్రానికి మాటలు: సుధాకర్
వంతరాయ, సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: యశ్వంత్, కళ: కె.వి.రమణ,
అలంకరణ: భాస్కర్‌రెడ్డి, దుస్తులు: బాబూరావు, సహ-దర్శకుడు: రామారావు శీతిరాల,
పోరాటాలు: విజయ్, సహనిర్మాతలు: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సుందర్.ఆర్,
నిర్మాత: నట్టికుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భారతీగణేష్
|