ఫిలిం న్యూస్
 
 
 
 
‘యువ కాళావాహిని’ మీడియా డైరీ
యువ కళావాహిని వ్యవస్థాపకుడు వై.కె.నాగేశ్వరరావు తనయుడు గురుప్రసాద్ స్మృత్యర్థం ప్రతి ఏటా రూపొందించే మీడియా డైరెక్టరీ ఆవిష్కరణ సభ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేచిన మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ 201011 ను ఆవిష్కరించి ప్రసంగించారు. కళా, సాంస్కృతిక రంగాలతో పాటు వివిధ రగాలనెంచుకుని సమాజసేవ చేస్తున్న పలువురు ప్రముఖుల వివరాలను పొందుపరుస్తూ రూపొందించి ఈ మీడియా డైరెక్టరీని వెలువరించడం గొప్ప సేవ అని రోశయ్య అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అతిధుల సమక్షంలో జరిగిన ఈ ఆత్మీయ సభలో ఈ డైరీ ఆవిష్కరింపడం పట్ల రోశయ్య సంతోషం వ్యక్తం చేశారు. విశిష్ట అతిథిగా పాల్గొనంన రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి.శంకర్ రావు మాట్లాడుతూ - తెలుగు జాతి గర్వించే సి.నారాయణరెడ్డి, డాక్టర్ డి.రామానాయుడుల ముఖ చిత్రాలతో రూపొందించిన ఈ డైరీ పాఠకులకు సమగ్ర సమాచారాన్ని అందించేలా రూపొందించిన నిర్వాహకులను అభినందించారు. ఈ డైరెక్టరీ ఆవిష్కరణ సభలో వేదికను పంచుకున్న ప్రముఖులలో ఆంధ్రప్రభ సంపాదకులు పి.విజయబాబు, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్.వి.రమణమూర్తి, వ్యాపారవేత్త సారిపల్లి కొండలరావు, సీనియర్ పాత్రికేయుడు వాసిరాజుప్రకాశం, దూరదర్శన్ పూర్త సంచాలకులు పాలకర్తి మదుసూదనరావు, ముఖ్య కార్యవిర్వహణాధికారి ఓలేటి పార్వతీశం, సినీ నటుడు గుండు హనుమంతరావు, రచయిత్రి డాక్టర్ కె.వి.కృష్ణకుమారి ఉన్నారు. జంట నగరాలకు చెందిన పలు కళ, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో పాటు గాయనీగాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.