ఆస్రానిర్మాణ్ ఇండియా, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్ పతాకంపై వీరశంకర్ దర్శకత్వంలో అరవింద్, రాజ్ కళ్యాణ్ హీరోలుగా రచనా మల్హోత్ర, రూపాకౌర్‌లు హీరోయిన్లుగా బి.వి.ఎస్.శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'యువరాజ్యం' సినిమా వివరాలను వెల్లడించడానికి ఫిలించాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో వీరశంకర్, సంగీత దర్శకులు రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, శివకాకాని, మురారి జయన్, శ్రీహర్ష, రాజ్‌కుమార్, రెహమాన్, నిర్మాత హారూన్, హెచ్.ఎస్.ఘంటాడికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీరశంకర్ మాట్లాడుతూ- 'ఈ సినిమా క్లైమాక్స్ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 22న శిల్పకళావేదికలో విడుదల చేయనున్నాము. ఈ సినిమాకి ఆరుగురు సంగీత దర్శకులు పనిచేశారని, ఆడియో టైమ్స్ గ్రూప్ ద్వారా ఈ సినిమా విడుదలవుతోందని' అన్నారు. నిర్మాత హరూన్ మాట్లాడుతూ- 'వీరశంకర్ కన్నడ సినిమాలు చూసి ఆయనతో సినిమా చేయాలనుకున్నాను. అదే సమయంలో ఆయన 'యువరాజ్యం' సినిమా చేసే ప్రయత్నంలో వున్నారు. కథ నచ్చడంతో ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాకు సంగీతం కూడా బాగా కుదిరింది' అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కృష్ణుడు, వెంకట్, ఎం.ఎస్.నారాయణ, రావు రమేష్, వేణుమాధవ్, కృష్ణభగవాన్, శ్రీనివాసరెడ్డి, జోగినాయుడు, సంగీత దర్శకుడు రాజు, కనిష్కా, బెంగుళూరు పద్మ, మాధవి, సౌందర్య, సిమ్రాన్, దీపు తదితరులు నటిస్తున్నారు. కెమెరా : ముజీర్, పాటలు: శ్రీహర్ష, పెద్దాడమూర్తి, రాజ్‌కుమార్, రెహమాన్, కేదార్‌నాథ్, బీమ్స్, మాటలు: రామస్వామి, వికర్ణ, సంగీతం : రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె.శివకాకాని, మురారిజయన్.
|