హోట‌ల్ ద‌స‌ప‌ల్లా క్రిస్మ‌స్ కేక్ మిక్సింగ్ వేడుక

హైద‌రాబాద్ సిటీలో నెల‌రోజుల‌కు ముందుగానే క్రిస్మ‌స్ సంబురాలు మొద‌లైపోయాయి. ట్రెడీష‌న‌ల్ క‌ల్చ‌ర్ తో క్రిస్మ‌స్ వేడుక కూడా కొత్త పుంత‌లు తొక్కుతోంది. విదేశాల్లో ఈ క‌ల్చ‌ర్ అనాటి కాలం నుంచే ఉన్నా..భార‌త‌దేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్త క‌ల్చ‌ర్ వ‌స్తోంది. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సిటీలో కేకు మిక్సింగ్ ల‌తో క్రిస్మ‌స్ వేడుక‌లు ప్రారంభ‌మైపోయాయి. సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో హోట‌ల్ ద‌స‌ప‌ల్లా యాజ‌మాన్యం కేక్ మిక్సింగ్  కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా జ‌రిపింది. హీరోలు రాజ‌శేఖ‌ర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత ఖ‌రీదైన ఆల్కహాల్..ప్రూట్ మిక్సింగ్ తో ఘ‌నంగా కేక్ మిక్సింగ్  ప్రారంభించారు.
అనంత‌రం హీరో రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ,` క్రిస్మ‌స్ కేక్ అంటే చెన్నై లో ఎక్కువ‌గా దొరుకుతుంది. హైద‌రాబాద్ లో ఇప్పుడిప్పుడే ఈ క‌ల్చ‌ర్ వ‌స్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేక్ అంటే స్పెష‌ల్ గా తింటా. కానీ ఎలా త‌యారు చేస్తారో తెలీదు. ఈరోజు ఆ విష‌యం కూడా తెలుసుకున్నా. అంద‌రికీ అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు.
హీరో సునీల్ మాట్లాడూతూ, `చిన్న‌ప్ప‌టి నుంచి కేకులంటే బాగా ఇష్టం. ఎక్కువ‌గా తినేవాడిని. ఈరోజు క్రిస్మ‌స్ కేక్ మిక్సింగ్ రావ‌డం చాలా సంతోషంగా ఉంది. అలాగే దాన్ని ప్రిప‌రేష‌న్ కూడా తెలుసుకున్నా. అంద‌రికీ ముందుగా హ్యాపీ క్రిస్మ‌స్` అని అన్నారు.
హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ,` క్రిస్మ‌స్ కేక్ ఫంక్ష‌న్ కు రావ‌డం ఇదే తొలిసారి. మంచి ఎక్స్ పీరియ‌న్స్ ఇది. త‌యారీ విధానం బాగుంది` అని అన్నారు.
ద‌స‌ప‌ల్లా ఏజిఎం జె.వి ర‌మ‌ణ మాట్లాడుతూ,` ఈ క‌ల్చ‌ర్ విదేశాల్లో ఎక్కువ‌గా ఉంటుంది.  ఇప్పుడిప్పుడే మ‌న‌దేశానికి కూడా వ‌స్తుంది. సెల‌బ్రిటీల న‌డుమ‌ మా ఫంక్ష‌న్ గ్రాండ్ గా జ‌రిగినందుకు సంతోషంగా ఉంది` అని అన్నారు.