జఐశ్వర్యరాయ్ అందాలన్నీ ఒక ఎత్తు, ప్రత్యేకించి పచ్చలహారంలో పొదిగిన వజ్రాల్లా మెరిసిపోయే ఆమె కళ్లు మరో ఎత్తు... ‘కన్నులతో చూసేది... గురువా’ అంటూ ‘జీన్స్’ చిత్రంలో ఆమె అభినయం ఇప్పటికీ మర్చిపోలేరు అభిమానులు. డ్యూయెల్ రోల్ గా ఆ సినిమా ఐశ్వర్య అభిమానులకు డబుల్ ధమాకా ఆనందాన్ని పంచింది. ఆమె అందమైన ఐస్ కే అభిషేక్ బచ్చన్ పడిపోయివుంటాడు ప్రేమలో... తన అందమైన కళ్లతోనే ఆమె సినీ అభిమానుల్నేగాక... ప్రపంచవ్యాప్త అభిమానుల్ని సొంతం చేసుకుంది. అటువంటి అద్భుతమైన కళ్లను ఐశ్వర్మయ ఇటీవల ఓ బ్లైండ్ స్కూల్ కు తన తదనంతరం దానం చేసేందుకు అంగీకరించిందట. ‘ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆగస్టు 31 దాకా జరిగే ఈ ఐ డొనేట్ క్యాంపెయిన్ కు ఐశ్వర్య తన కళ్లను దానం చేసి ఉదారతను చాటింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరికొందరు ఆమె అభిమానులు కూడా తమ కళ్లను దానం చేసేందుకు సిద్ధం అవుతున్నారట. ఈ విషయంపై ఐశ్వర్య మాట్లాడుతూ - ‘ఇంతకాలం నా కళ్లను చూసి ప్రభావితమై చాలా మంది నాకు అభిమానులు అయ్యారు. నా కెరీర్ కు కూడా కళ్లు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. విశ్వసుందరిగా నన్ను నిలబడేలా చేసింది కూడా ఆ కళ్లే అని నా గట్టి నమ్మకం. అలాంటిది ఇన్ని కోట్ల మంది అభమానాన్ని సొంతం చేసుకున్న నేను వారి కోసం నా కళ్లను దానం చేయడం నా మనసుకు తృప్తినిస్తుంది. అందుకనే ఎవరు ఏమనుకున్నా... నా నిర్ణయం లో మార్పు ఉండదు. ఇది నేను పూర్తిగా నా ఇష్టప్రకారం చేస్తున్న దానం. ఇదులో ఎవరి బలవంతమూ లేదు. నేను చేసే పని నలుగురికీ ఉపయోగపడేలా ఉంటే చాలు’ అంటోంది ఈ అందాల భామ.
|