Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
లతకు అక్కినేని అవార్డు

      'పద్మభూషణ్‌' డా|| అక్కినేని నాగేశ్వరరావు తన పేరిట ఏర్పాటుచేసిన 'ఎఎన్నార్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు'ను ఈ ఏడాది ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా ఓ సినిమా ప్రముఖునికి ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డును టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలో డి.రామానాయుడు, బోనీకపూర్‌లు సభ్యులుగా వున్న కమిటీ ఎంపిక చేస్తుంది. 4లక్షల మొత్తాన్ని అవార్డు గ్రహీతకు ఇస్తారు.

గతంలోనే లతామంగేష్కర్‌కు ఈ అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పటికీ వీలుకాలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. దేశం గర్వించదగ్గ గాయనీమణి లతకు ఈ అవార్డు ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుందని అక్కినేని అన్నారు. ఫిబ్రవరి 1 ఉదయం తాజ్‌కృష్ణాలో జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ముఖ్యఅతిథిగా, కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ గౌరవ అతిథిగా విచ్చేస్తారని అన్నారు. కారణాంతరాల వల్ల ఈ కార్యక్రమానికి ఈసారి వెంకట్‌, నాగార్జున రాలేకపోతున్నారు. అమలు ఈ వేడుకలను నిర్వహిస్తుంది. లాతామంగేష్కర్‌ మధురగీతాలను మాళవిక, ప్రణతి ఆలపిస్తారని చెప్పారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005