Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
దర్శకత్వశాఖలో అక్షరా హసన్

      కమల్ హసన్ ప్రధమ కుమార్తె శృతి హసన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. రెండో కుమార్తె ‘అక్షర’ దర్శకురాలు కావాలని కోరుకుంటూ దర్శకత్వ శాఖలో ‘అక్షరాభ్యాసం’ చేస్తున్నది. తన తండ్రిచే వదిలివేయబడి మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సారిక ప్రస్తుతం ‘సొసైటీ’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. బాలథాకరే కోడలు స్మితా థాకరే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డింపుల్ కపాడియా, ఓంపురి, రణధీర్ కపూర్ వంటి సీనియర్ నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో అక్షర పనిచేస్తున్నది. మరి దర్శకత్వ శాఖలో శిక్షణ ముగిసాక తన తండ్రి కాల్షీట్స్ అడుగుతుందేమో చూడాలి. అప్పుడు కమల్ హసన్... కూతురు దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి హీరో అవుతాడు. తన అత్త సుహాసిని ఒకటి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించడం నుంచి స్ఫూర్తి పొందిందో ఏమో కానీ... నటనకు బదులుగా దర్శకత్వాన్ని ఎంపిక చేసుకున్న అక్షరను అందరూ అభినందిస్తున్నారు. 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతీయ సినిమా రంగంలో మహిళా దర్శకులు ఇప్పటికీ వేళ్ల మీద లెక్కించేంత అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వేలల్లో ఉన్న హీరోయిన్లతో పోటీ పడేకంటే.. వేళ్ల మీద లెక్కించగలిగేంత మందితో పోటీ పడడం బెటరని అక్షర భావించి ఉంటుంది!

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005