మసాలా
 
 
 
 
విక్రమ్‌తో మరోసారి అంటున్నఅమల పాల్
ఇద్దరు హీరోయిన్ల చిత్రాల్లో నటించేందుకే ఆసక్తి చూపుతున్నట్టున్నారు?
దర్శకుడు విజయ్ దైవతిరుమగల్ చిత్ర కథ చెప్పినప్పుడే అనుష్కకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో నాకు అంతే ఉంటుందని చెప్పారు. అదే విధంగా నేను, అనుష్క పాత్రలకు తగ్గట్టుగా నటించాం. నా మాట ఎంత నిజమో చిత్రం చూస్తే మీకే తెలుస్తుంది.

విక్రమ్ సరసన నటించిన అనుభవం గురించి?
జాతీయ అవార్డు హీరో సరసన నటించేందుకు మొదట్లో కొంచెం కంగారుపడ్డ మాట నిజమే. నా తడబాటును గమనించిన విక్రమ్ స్నేహంగా మెలిగి భయాన్ని పోగొట్టారు. ఆయన ప్రోత్సాహం నన్నెంతో ఉత్సాహపరి చింది. ఇక విక్రమ్ అద్భుత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే చర్చించుకుంటున్నారు. విక్రమ్‌కు మరోసారి జాతీయ అవార్డు రావడం ఖాయం.

ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?
ఈ చిత్రం ప్రమోషన్ కోసం చాలా థియేటర్లు చుట్టొచ్చాం. ప్రేక్షకుల చప్పట్లు, అభినందనలు చూస్తున్నప్పుడు కళ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. ఒక ప్రత్యేక వర్గం వారే చూసి ఆనందిస్తారనుకున్న ఈ చిత్రాన్ని అన్నివర్గాల వారు ఆదరిస్తుంటే ఎనలేని సంతోషం కలుగుతోంది.

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
నిజం చెబుతున్నాను. మరోసారి విక్రమ్‌తో నటించాలని ఆశగా ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. నటనలో నాకు స్ఫూర్తి ఆయనే. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టై చిత్రంలో ఆర్యకు జంటగా నటిస్తున్నాను. అదే విధంగా అధర్వ సరసన ముప్పొళుదుమ్ ఉన్ కర్పనైగళ్ చిత్రంలో నటిస్తున్నాను.