అమిర్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, సల్మాన్‌ఖాన్‌లు సైబర్ ప్రపంచంలో టాప్-20 పాపులర్ సెలబ్రిటీలుగా నిలిచారు. ‘ఫేమ్‌కౌంట్’ వెబ్‌సైట్
రూపొందించిన ఈ జాబితాలో హాలీవుడ్ స్టార్ల హవా కొనసాగినా ఈ ముగ్గురు బాలీవుడ్ తారలకు కూడా చోటు లభించటం గమనార్హం. ‘గజినీ’,
‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ విజయాలతో మంచి ఊపు మీదున్న అమిర్‌ఖాన్‌కు టాప్-20 జాబితాలో పదో స్థానం దక్కింది. ఈ హీరోకి
‘ఫేస్‌బుక్’లో సుమారు 35,68,390 మంది అభిమానులు, సామాజిక సంబంధాల సైట్ ట్విట్టర్‌లో 8,47,524 మంది
అనుయాయి(ఫాలోవర్)లున్నారు. ‘దేశీ గర్ల్’ ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 12వ స్థానంలో నిలిచారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన బాలీవుడ్ సెలబ్రిటీ ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఈ కథానాయికకి ‘ఫేస్‌బుక్’లో దాదాపు 24,78,136 మంది
అభిమానులు ఉన్నారు. ట్విట్టర్‌లో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఇటీవలే ఓ మిలియన్ దాటి 11,64,632కు చేరింది. టాప్ 20 పాపులర్
సెలబ్రిటీల జాబితాలో కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు 17 ర్యాంక్ వచ్చింది. ఈ ‘దబంగ్’ నటుడికి ‘ఫేస్‌బుక్’లో 29,67,663 మంది అభిమానులు,
‘ట్విట్టర్’లో 81,78,864 మంది ఫాలోయర్‌లు ఉన్నారు. ఇదిలాఉండగా బ్లాగర్, ట్విట్టర్లలో ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉండే
బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌కు ఈ జాబితాలో అసలు చోటే లభించకపోవటం ఆశ్చర్యకరం.
హాలీవుడ్ హీరో ఆష్టన్‌కుచ్చర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో 1,02,85,609 మంది అభిమానులు, ట్విట్టర్‌లో 71,49,425 మంది
ఫాలోవర్‌లు ఉన్నారు. ఈ నటుణ్ని ‘యూట్యూబ్’లో 49,12,664 మంది ఫ్యాన్స్ దర్శించుకుంటున్నారు. ‘మెన్ ఇన్ బ్లాక్’ నటుడు విల్‌స్మిత్‌కు
ఈ జాబితాలో రెండో స్థానం లభించింది. ఇతనికి ఫేస్‌బుక్‌లో 2,09,97,990 మంది అభిమానులు, యూట్యూబ్‌లో 1,16,22,781 మంది వీక్షకులు
ఉన్నారు. ఈ జాబితాలోని మూడో స్థానంలో మార్షల్ ఆర్ట్స్, కుంగ్‌ఫూ స్పెషలిస్ట్, హీరో జాకీచాన్ నిలిచాడు. ఈ ‘హార్ట్ ఆఫ్ డ్రాగాన్’ స్టార్‌కి
ఫేస్‌బుక్‌లో 1,99,97,990 మంది ఫ్యాన్స్, ట్విట్టర్‌లో 21,69,74 మంది అనుయాయులు ఉన్నారు.
|