బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనే ట్యాగ్‌లైన్ ఎవరికి ఉంటుందో ఇట్టే ఊహించొచ్చు. అది అమీర్‌ఖాన్
ముద్దుపేరు. కానీ ఈ ముద్దుపేరు, ట్యాగ్‌లైన్ తిరస్కరిస్తున్నాడు. పనిచేయడానికి ప్రయత్నిస్తానని,
దాన్ని నమ్మి చేస్తానని, అంతేగాని అన్నీ పక్కాగా ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదని ఆయన
వివరిస్తున్నాడు.
'నాకు నేను పర్‌ఫెక్షనిస్ట్‌గా భావించను. ఎవరైనా అన్నింటా పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉంటారని కూడా అనుకోను.
అలా ఉండగలిగే వ్యక్తులూ లేరు. పని పట్ల ఇష్టతే నన్ను దానిపట్ల సీరియస్‌గా దృష్టి సారించే అవకాశం
కలిగిస్తుంది' అని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్ట్‌వల్ 2010
కార్యక్రమంలో అమీర్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెలుబుచ్చిన అంశాలు...
'గజనీ' చిత్రం కోసం కండలు పెంచడం, 'త్రీ ఇడియట్స్' కోసం ఓ కాలేజీ కుర్రాడిలా
తయారవడం...ఇవన్నీ కొత్తదనం చూపడంలో ఓ భాగమే. ఓ నిర్దిష్టపదం నాకు తగిలించి
సరిపోతుందనుకుంటే కుదరదు. నేను శిక్షణ పొందిన నటుణ్ని కాదు. ఈ పద్ధతిలో నటించాలని అనేది
నాకు తెలియదు' అని ఆయన అన్నారు. లగాన్, తారేజమీన్‌పర్, త్రీ ఇడియట్స్, పీప్లీలైవ్
మొదలైన చిత్రాలతో ఆయనకి దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడుతున్నారు.
అమీర్‌ఖాన్ అండ్ టీంను వీరంతా పోగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'విజయవంతమైన సినీ కెరీర్ నాది.
సినిమా అనేది కలెక్టీవ్ ఆర్ట్. దీని విజయం కేవలం నా ఒక్కడిదే కాదు. ఎంతో మంది ప్రతిభావంతుల
కృషి. వారంతా సమిష్టిగా పనిచేయడం వల్ల సాధించిన మంచి పనితనం' అంటూ ప్రతీచోటా ఆయనకు
దక్కుతున్న ప్రశంసలకు సమాధానమిస్తున్నారు. 'సినిమా తీయడమనే పని మొదలెట్టాక ఈ అవార్డుల
గురించి ఆలోచించను. అలాంటి ఆలోచనలేవీ నా మెదడులో ఉండవు. నేను నమ్ముతున్నది
ఒక్కటే...అది అభిమానుల్ని అలరించడం కోసం, నా కోసం, సినిమాలు తీస్తున్నాననేది.
ఇంతకుముందు ఇండియన్ సినిమాలో ఇది చూడలేదనే అనుభూతి ప్రేక్షకుడికి కలగాలి. అదే గొప్ప
విషయం' అని అన్నారు. అర్థవంతమైన చిత్రాలకు చిరునామాగా మారారు కదా ? అనే ఓ ప్రశ్నకు
అమీర్‌ఖాన్ ఇలా సమాధానమిచ్చారు...
'రెండు దశాబ్దాలకుపైగా ఇండిస్టీలో పనిచేస్తున్నాను. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో (ఏటికి
ఎదురీదుతున్నా...) ఈత కొడుతున్నా. కొంతమేర విజయం సాధించాను. కానీ గత 20
సంవత్సరాల్లో, ఇప్పటికీ ఏదో మార్పు తీసుకురావడం కోసం సినిమాలు చేయలేదు'. ఆడవాళ్లతో
అమీర్‌కు అదృష్టం కలిసివస్తోంది అని బాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంట్లో మాత్రం నిజం ఉందనే
చెబుతున్నారు. ఆయన మాటల్లో...'కిరణ్ (అమీర్‌ఖాన్ భార్య), నేనూ గత నాలుగేళ్లుగా కలిసి
పనిచేస్తున్నాం. 'తారేజమీన్‌పర్' నిర్మాణంలో తను చాలా సహాయం చేసింది. ఈ కాంట్రిబ్యూషన్
'జానే తు యా జానే నా', 'పీప్లీలైవ్' వరకూ కొనసాగింది. నా చిత్రాల విజయంలో ఆవిడకు గరిష్ట
భాగమే ఉంది' అని తన విజయ భాగస్వామి కిరణ్‌రావు గురించి అమీర్‌ఖాన్ అన్నారు.
|