Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
భలే చెప్పాడు బచ్చన్!

     జీవిండం అంటే ఏమిటి? అనుభవించడం అంటే ఏమిటి? అరవయ్యేళ్ళూ దాటి వచ్చేసిన తరవాత ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కి కొత్త ఆలోచనలు స్ఫురిస్తున్నట్లున్నాయి. అందుకే ఆయన జీవితాన్ని జీవించడం గురించి తన అభిమానులకో సరదా సందేశం ఇచ్చారు. బిగ్ బి చెప్పిన సందేశం లాంటి జోక్ ఏమిటో తెలుసా?

ఒక మంచి మనిషి చనిపోయాడు. ఎంతమంచి వాడంటే సిగరెట్టు తాగడు, మద్యం ముట్టడు. మరే వ్యసనాలూ లేవు. అలాంటివాడు చనిపోయినప్పుడు బీమా కంపెనీ వారు మాత్రం అతనికి బీమా సొమ్ము ఇవ్వడానికి తిరస్కరించారట. ‘అసలు ఎన్నడూ జీవించని వ్యక్తి మరణించడం ఎలా సాధ్యమంటూ’ వారు ఆ క్లెయిమ్ తిప్పికొట్టారట. (ఈ అలవాట్లు లేని జీవితం అసలు జీవించడం ఎలా అవుతుందని వారి భావం అన్నట్టుగా)- అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ జోక్ ని పోస్ట్ చేశారు. ఇంతకూ ఆయన తన అభిమాన ప్రపంచానికి చెప్పదలచుకున్నది ఏమిటి? జీవితం వున్నది అనుభవించడానికే అన్నట్టుగా.. సుఖ తత్వబోధన చేస్తున్నాడా? ఆయనమాటల్లో మార్మం మాత్రం అదే... జీవితానుభవంతో అమితాబ్ చెప్పిన సందేశంలో ఎంతో సత్యం వుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005