మసాలా
 
 
 
 
సిక్స్‌ప్యాక్‌ మానసిక దృఢత్వంతో ఉన్నా : బిగ్‌ బి
ఇప్పుడంతా సిక్స్‌ప్యాక్‌ ఫీవర్‌ నడుస్తోంది. జనాల్లో కన్నా, సినిమా కథానాయకులకు చాలా ప్రాధాన్యనతగల అంశం ఈ సిక్స్‌ప్యాక్‌ శరీరధారుఢ్యం. దీనిపై బిగ్‌బి అమితాబ్‌ తనదైన శైలిలో స్పందించాడు. అదేంటంటే...'శారీరక దృఢత్వం ఉండాలన్న ఫీలింగ్‌ సరైందే. అందరికీ అవసరం. అయితే సిక్స్‌ప్యాక్‌ ఫిజిక్‌ కోసం అందరూ తాపత్రయపడటం మంచిది కాదు. కొంతమంది శరీరతత్వానికి ఈ ప్రయత్నం సరిపోదు. ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కుర్ర హీరోలు దీని జోలికి వెళ్లొద్దు. అందం, శారీరక దృఢత్వం కథానాయకుడికి చాలా అవసరమైనవే. మానసిక ప్రశాంతతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజానికి నేను సిక్స్‌ప్యాక్‌ మానసిక దృఢత్వంతో ఉన్నాను. మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నవారంతా ఈ కోవలోకే వస్తారు. ఇంకో పదేళ్ల వరకూ నా కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు' అని చెప్పుకొచ్చారు.