మసాలా
 
 
 
 
గ్లామర్‌ తగ్గని అందాల అమ్మలు
పలువురు హాలీవుడ్ అందాల తారలు, సెలబ్రిటీలు పిల్లలు పుట్టాక కూడా తమ ప్రొఫెషన్‌లో కొనసాగుతూ అందర్నీ మురిపిస్తున్నారు. వీరిలో తారలైతే ఎప్పటిలాగే సినిమాల్లో హాట్‌, హాట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండగా, సింగర్లు, మోడల్స్‌ తమ ప్రొఫెషన్‌లో కొనసాగుతూ ఎప్పటిలాగే అభిమానులను మైమరపిస్తున్నారు. ఇటువంటి అందాల తల్లుల్లో ఏంజిలీనా జోలీ, బ్రిట్నీ స్పియర్స్‌, సల్మా హయక్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌ వంటి వారు హాటెస్ట్‌ మావ్గ్సుగా గ్లామర్‌ రంగంలో వెలుగొందుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో పలువురు హాలీవుడ్ అందాల భామలను వారి అభిమానులు హాటెస్ట్‌ మావ్గ్సుగా ఎంపికచేశారు.

హాలీ బెర్రీ...
ఆస్కార్‌ అవార్డు విజేత హాలీ బెర్రీకి మూడు సంవత్సరాల నహ్లా అనే కూతురు ఉంది. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గాబ్రియల్‌ అబ్రీతో కలి సి జీవించినప్పుడు పాప పుట్టింది.హాలీవుడ్‌ హాటెస్ట్‌ మామ్‌ పోల్‌లో ఈ సెలబ్రిటీకి 24 శాతం ఓట్లు దక్కి అగ్రస్థానంలో నిలవడం విశేషం. హాటెస్ట్‌ మామ్‌గా అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.గత నెల 4వ తేదీన లాస్‌ ఏంజిల్స్‌లోని ద ష్రైన్‌ ఆడిటోరియ మ్‌లో జరిగిన 42వ ఎన్‌ఎఎసిపి ఇమేజ్‌ అవార్డుల కార్యక్రమంలో అందరి ముందుకు వచ్చి కనువిందుచేశారు.

ఏంజిలీనా జోలీ...
హాటెస్ట్‌ మామ్‌ల లిస్ట్‌లో రెండవ స్థానాన్ని ఆక్రమించారు హాలీవుడ్‌ తార ఏంజిలీనా జోలీ. పోలింగ్‌లో ఆమెకు 20 శాతం ఓట్లు దక్కా యి. తన జీవిత భాగస్వామి అయిన హాలీవుడ్‌ హీరో బ్రాడ్‌ పిట్‌తో కలిసి జీవిస్తున్న ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలే తన ప్రాణమని పేర్కొంటుంది జోలీ. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ద టూరిస్ట్‌ ప్రీమియర్‌లో ఈ తార పాల్గొని అభిమానులను అలరించింది.

బ్రిట్నీ స్పియర్స్‌...
పాప్‌ రారాణి బ్రిట్నీ స్పియర్స్‌ 15శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచింది. పిల్లలు పుట్టినా బ్రిట్నీలో గ్లామర్‌ పెరి గిందే కానీ ఏమాత్రం తగ్గలేదని ఆమె అభిమానులు సెలవిస్తు న్నారు. ఇక బ్రిట్నీ ఈ ఏడాది మార్చి 27న క్యాలిఫోర్నియా సాన్‌ ఫ్రాన్సిస్కోలోని బిల్‌ గ్రాహ్‌ సివిక్‌ ఆడిటోరియంలో గుడ్‌మార్నింగ్‌ అమెరికాస్‌ టేపింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో సంగీత ప్రియులను అలరించింది.

సల్మా హయక్‌...
అందాల భామ సల్మా హయేక్‌ 12 శాతం ఓట్లతో హాటెస్ట్‌ మా మ్‌ల లిస్ట్‌లో నాలుగవ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఫిబ్ర వరిలో లండన్‌లో జరిగిన ఆరెంజ్‌ బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ సెలబ్రిటీ పాల్గొని అందర్నీ మురిపిం చింది.

జెన్నిఫర్‌ లోపెజ్‌...
హాలీవుడ్‌ తార, పాప్‌ గాయనీ, మోడల్‌ అయిన జెన్నిఫర్‌ లోపెజ్‌కు పోలింగ్‌లో ఆరు శాతం ఓట్లు దక్కాయి. ఆమె ఈ ఏడాది మార్చిలో లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఫాక్స్‌ అమెరికన్‌ ఐడల్‌ ఫైనలిస్ట్‌ పార్టీకి హాజరై కనువిందుచేసింది. ఈ అందాల భామకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది.

కేట్‌ బెకిన్‌సేల్‌...
సెలబ్రిటీ కేట్‌ బెకిన్‌సేల్‌ 5 శాతం ఓట్లు దక్కాయి. ఈ తార ఫ్రాన్స్‌ కేన్స్‌లో జరిగిన 63వ ఆన్వల్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఇల్‌ గట్టొ పార్డొ’ సినిమా ప్రీమియర్‌ షోకు జ్యూరీ సభ్యురాలిగా హాజరై అం దర్నీ మైమరపించింది.

టెరి హ్యాచర్‌...
టెరి హ్యాచర్‌ 3 శాతం ఓట్లతో ఆమె అభిమానులు హాటెస్ట్‌ మామ్‌ లిస్ట్‌లో ఎంపికచేశారు. ఈ తార న్యూయార్క్‌లో జరిగిన గెట్‌హ్యాచ్‌ డ్‌ డాట్‌కామ్‌ ప్రారంభోత్సవానికి హాజరై సందర్శకులకు కనువిందుచేశారు.పలు హిట్‌ హాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఈ అందాల భామ గ్లామర్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించు కుంది.

మోనికా బెల్యుస్సి...
హాటెస్ట్‌ మామ్‌ లిస్ట్‌లో చోటుదక్కిన సెలబ్రిటీ మోనికా బెల్యుస్సికి రెండు శాతం ఓట్లు లభించాయి. ఈ హాలీవుడ్‌ తార ఫ్రాన్స్‌ కేన్స్‌ లో జరిగిన 62వ కేన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరై అభి మానులను అలరించింది. ఆమె గ్లామర్‌ తారగానే కాకుండా చక్కటి నటిగా ప్రేక్షకులను మైమరపిస్తున్నారు.