మసాలా
 
 
 
 
అందాల ప్రపంచంలో చీకటి కోణాలు
ఫ్యాషన్‌ ప్రపంచంలో మోడల్స్‌ మెరుపులు అందరికీ తెలిసిందే. మోడల్స్‌ లేనిదే ఫ్యాషన్‌ షోలే లేవు. ఫ్యాషన్‌ డిజైనర్‌ ఎంత చక్కగా వస్త్రాలను డిజైన్‌ చేసినా వాటిని ర్యాంప్‌పై మోడల్స్‌ చక్కగా ప్రదర్శించినప్పుడే అవి పదిమంది దృష్టినీ ఆకర్షిస్తాయి. ఫ్యాషన్‌ రంగంలో మోడల్సే ప్రధాన పాత్ర వహిస్తారు. ఈ నేపథ్యంలో పూర్తిగా గ్లామర్‌ రంగమైన మోడలింగ్‌లోకి నేడు పలువురు యువతులు ప్రవేశిస్తున్నారు. కానీ చక్కటి అవకాశాలు లభించక కొందరు తెరమరుగవుతుంటే మరికొందరు తమ టాలెంట్‌, అందచందాలతో నిలదొక్కుకుంటున్నారు. పైకి బాగా కనిపించే మోడలింగ్‌లోకి ప్రవేశించిన కొందరు యువతులు అవకాశాలు లభించక పెడద్రోవ పడుతున్నారు. చివరికి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఒకప్పుడు ఫ్యాషన్‌ షోలను చూడాలంటే ముంబయ్‌, ఢిల్లీ నగరాలకు వెళ్లా ల్సివచ్చేది. ముఖ్యంగా ముంబయ్‌లో బాలీవుడ్‌, మరోవైపు మోడ లింగ్‌ రంగాలు అందరి దృష్టిని ఆకర్షించేవి. ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఎప్పుడూ టాప్‌ మోడల్స్‌చేత ఫ్యాషన్‌ షోలు జరుగుతుండేవి. క్రమేణా దేశం లోని ప్రధాన నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి పెరుగుతూ వచ్చింది. నేడు దక్షిణా దిన బెంగళూర్‌, హైదరాబాద్‌, చెన్నై నగరాలు ఫ్యాషన్‌ కేంద్రాలుగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ముందుగా బెంగళూర్‌ నగరం ఫ్యాషన్‌ షోల కు కేంద్రంగా మారింది. అక్కడ టాప్‌ మోడల్స్‌, ఫ్యాషన్‌ డిజైనర్లు, కొరియో గ్రాఫర్లు రూపుదిద్దుకున్నారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో గత నాలుగు, అయిదు సంవత్సరాల నుంచి ఫ్యాషన్‌ షోల నిర్వహణ పెరుగుతూ వస్తోంది. నగరం లోని స్టార్‌ హోటళ్లు, పబ్‌లు, ప్రముఖ జ్యూయలరీ, వస్త్రాల షోరూంలలో తర చుగా ఫ్యాషన్‌ షోలు జరుగుతూ అందర్నీ దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫ్యాషన్‌ షోలలో పాల్గొంటున్న నగరానికి చెందిన మోడల్స్‌, డిజైనర్లు ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. నగరానికి చెందిన కొందరు మోడల్స్‌, డిజైనర్లు బెంగళూర్‌, ముంబయ్‌లలో జరుగుతున్న ర్యాంప్‌షోలలో సైతం పాల్గొంటున్నారు. మరి కొందరు మోడల్స్‌ జ్యూయలరీ, వస్త్రాల షోరూంలకు మోడలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు ర్యాంప్‌ షోలు మరోవైపు కమర్షియల్‌ యాడ్స్‌ చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరుతోపాటు పెద్ద మొ త్తంలో డబ్బులు సంపాదించే మోడలింగ్‌ పట్ల పలువురు యువతులు ఆకర్షితు లవుతున్నారు.

అవకాశాల కోసం పోటీ...
రంగుల ప్రపంచమైన మోడలింగ్‌లో ఎన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయి. నేడు మోడలింగ్‌లో నిలదొక్కుకోవాలంటే యువతులు చాలా పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో జరుగుతున్న ఫ్యాషన్‌ షోలలో ఇక్కడి మోడ ల్స్‌తో పాటు ముంబయ్‌, బెంగళూర్‌లకు చెందిన మోడల్స్‌ సైతం పాల్గొంటు న్నారు. దీంతో ఇక్కడి మోడల్స్‌కు అక్కడివారితో తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది. దీంతో మోడలింగ్‌లో రాణించేందుకు అవసరమైన అన్ని అర్హతులు ఉన్నవారే ఈ రంగంలో నిలదొక్కుకోగల్గుతున్నారు. కొందరు యువతులు మోడలింగ్‌ లో ఎటువంటి శిక్షణ లేకుండానే ప్రవేశిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటున్న, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్న అందమైన యువతులు కొందరు మోడలింగ్‌లోకి వస్తున్నారు. ఇక మోడల్‌కు కావాల్సిన కనీస ఎత్తు, అవసరమైన శిక్షణ, ఇతర అర్హతలు లేకుండానే వారు ఈ రంగంలోకి వచ్చేస్తున్నారు. నగరంలో నేటికీ మోడల్‌ ఏజెన్సీలు లేవు. అదే ముంబయ్‌, బెం గళూర్‌లో ఎన్నో మోడల్‌ ఏజెన్సీలు ఉన్నా యి.

ఈ ఏజెన్సీలు కొరియోగ్రాఫర్లు, ఫ్యాషన్‌ డిజైనర్ల అవసరాల మేరకు ఫ్యాషన్‌ షోలలో క్యాట్‌వాక్‌ చేసే మోడల్స్‌ను పరిచయం చేస్తు న్నాయి. ఇక నగరంలో అటువంటి ఏజెన్సీలు ఏమీ లేకపోవడం ఇక్కడి మోడల్స్‌కు మైనస్‌ పాయింట్‌. నగరానికి చెందిన మోడల్స్‌ కొం దరు స్వంతంగా అవకాశాలను వెతుక్కుం టుండగా మరి కొందరు మోడల్‌ కోఆర్డినేట ర్లపై ఆధారపడుతున్నారు. అందుకోసం అం దం, టాలెంట్‌ ఉన్నవారిని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నగరానికి చెందిన పలు జ్యూయలరీ, వస్త్రాలు, ఇతర ఫ్యాషన్‌ యాక్సరీస్‌ షోరూంల నిర్వాహకులు తమ కమర్షియల్‌ యాడ్స్‌ కోసం నగరంతో పాటు బెంగళూర్‌, ముంబయ్‌ మోడల్స్‌ను తీసుకుం టున్నారు. న్యూస్‌ పేపర్లు, టివి చానెల్స్‌లో యాడ్స్‌ కోసం, హోర్డింగ్‌లపై యాడ్స్‌ కోసం వీరు మోడల్స్‌ను ఎంపికచేస్తున్నారు. కొందరు షోరూం ల నిర్వాహకులు కేవలం ముంబయ్‌, బెంగళూర్‌ మోడల్స్‌వైపే మొగ్గుచూపుతు న్నారు. దీంతో ఇక్కడి మోడల్స్‌కు అవకా శా లు సన్నగిల్లుతున్నాయి.

మూడు నుంచి అయిదు సంవత్సరాలే...
మోడలింగ్‌లో యువతులకు లైఫ్‌ మూడు నుంచి అయిదు సంవత్సరాలు మాత్రమే ఉంటోంది. ఫ్యాషన్‌ డిజైనర్లు, కొరియో గ్రాఫర్లు, షోరూంల నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం వెదుకుతుండడంతో కొత్త మోడల్స్‌ తెర మీదకు వస్తున్నారు. మోడలింగ్‌లో ఎంత రాణించినప్పటికీ మూడు, నాలుగు సంవత్సరాల తర్వాత మోడల్స్‌ పరిస్థితి వేరుగా ఉంటోంది. సరైన అవకాశాలు లభించక చివరికి యువతులు తెరమరుగు కావాల్సి వస్తోంది.

పెడద్రోవపడుతున్న యువతులు...
మోడలింగ్‌లో రాణించి పదిమందిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కోరు కుంటున్న యువతులు నేడు ఎందరో ఉన్నారు. కానీ సరైన అవకాశాలు లభించక వారు నీరుగారిపోతున్నారు. ముఖ్యంగా ముంబయ్‌, బెంగళూర్‌ మోడల్స్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుండడంతో వారికి ఎన్నో ఆటంకాలు ఎదుర వుతున్నాయి. దీంతో కొందరు మోడల్స్‌ అవకాశాలు లభించక పెడద్రోవపడు తున్నారు. మోడలింగ్‌ చేసే యువతులు పబ్‌లలో జరిగే నైట్‌పార్టీలకు తరచు గా వెళ్తూ పార్టీలను ఎంజాయ్‌ చేస్తారు. అక్కడ కొందరు మోడల్స్‌ మద్యానికి అలవాటు పడుతున్నారు. మోడలింగ్‌లో అవకాశాలు లభించక నిరుత్సాహానికి గురవుతున్న కొందరు మోడల్స్‌ డ్రగ్స్‌కు సైతం అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు రోజంతా మత్తులో తూలుతూ తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇక కొందరు మోడల్స్‌ అవకాశాల కోసం పలువురిని ఆశ్రయిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా వారి లైం గిక వాంఛలను తీరుస్తున్నారు. ఎలాగైనా అవకాశాలను దక్కించుకోవాలన్న కసి వారిని బలహీనపరుస్తోంది. ఇక కొంతకాలం ఈ గ్లామర్‌ రంగంలో ఎన్నో ఎగుడు,దిగుడులను చూసిన యువతులు చివరికి మోడలింగ్‌ నుంచి తప్పుకొని తెరమరుగవుతున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా...
రాణించిన కొందరు యువతులు ప్రేమ వివాహాలు చేసుకుంటు న్నారు. ఇంట్లో వాళ్లు సమ్మతించనప్పటికీ వివాహాలు చేసుకొని తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నారు. ఇక మోడలింగ్‌లో కొనసాగేందుకు కొందరు యువతులు గుట్టుచప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేసుకుంటుండడం గమనార్హం. పెళ్లయితే మోడలింగ్‌లో అవకాశాలు సన్నగిల్లుతాయని భావించి వారు ఈ విధంగా చేస్తున్నారు. కొందరు మోడల్స్‌కు సమాజంలో చిన్నచూపు ఎదుర వుతోంది. మోడలింగ్‌లో అవకాశాలు లేక పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ దామనుకున్న యువతులకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మోడల్స్‌ అంటే కొందరికి దురభిప్రాయం ఉండడం మూలంగా వారికి సరైన సంబంధా లు దొరకక బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కొందరు తెలివైన మోడల్స్‌ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చన్న విధంగా మోడలింగ్‌లో రాణించిన తర్వాత ఇతర రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. మోడలింగ్‌ చేస్తూనే సినీ నటీ మణులుగా కొనసాగుతున్న యువతులను నేడు కొందరిని చూడవచ్చు. కొం దరు యువతులు మోడలింగ్‌తో పాటు యాంకరింగ్‌, డీజేయింగ్‌ చేస్తూ రాణిస్తుండడం మరో విశేషం. ఎప్పటికైనా మోడలింగ్‌ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే యువతులు కొందరు ఇతర రంగాలపై దృష్టి పెడుతూ తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. తళుక్కుమంటూ ప్రకటనలలో కనుపించే మోడల్స్‌ జీవితాలలో చీకటి కోణాలు తక్కువేం కాదు. ఈ పోటీని తట్టుకోలేక, తమ కెరీర్‌ చివరకు వచ్చిందని డిప్రెషన్‌లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్న మోడళ్ళ సంఖ్య కూడా పెరగడం గమనార్హం.