మసాలా
 
 
 
 
ఏంజిలినా జోలీ సేవలు స్ఫూర్తిదా యకం
ఏంజిలీనా జోలి ...అమెరికన్‌ మోడల్‌, ప్రఖ్యాత హాలీవుడ్‌ హీరోయిన్‌. హాలీవుడ్‌లో ఒకానొక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న నటి ఆమె. ప్రఖ్యాత హాలీవుడ్‌ నటిగా విశ్వవ్యాప్త అభిమానులను సొంతం చేసుకున్న జోలీ మూడుసార్లు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. రెండుసార్లు స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులను, అనితర సాధ్యమైన అకాడమీ అవార్డులను అందుకున్న జోలీ ప్రపంచ అత్యంత ప్రభావం గల వందమంది మహిళల జాబితాలోనూ తన హవా కొనసాగిస్తోంది.

ఏంజిలీనా జోలీకి తాను సంపాదించిన కీర్తిప్రతిష్టలు, డబ్బు తృప్తినివ్వలేదు. ఆమె చిన్ననాటినుండి కష్టాలతోనే జీవి తం ఆరంభించింది. ఏడేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది. అయితే చిన్నప్పటినుంచి నటనమీద ఉండే అభి మానంతో ఏడు సంవత్సరాల వయసులోనే ముఖానికి రంగువేసుకుంది. తల్లి, తమ్ముడితో కలిసి సినిమాలు విపరీతం గా చూసేది. ఎప్పటికైనా సినిమా యాక్టర్‌ కావాలని కలలు కనేది. 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్‌లో ప్ర వేశించి అందరి దృష్టిని తనవైపు మరల్చుకుంది. 1995లో విడుదల అయిన హ్యాకర్స్‌ చిత్రం ద్వారా పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారి హాలీవుడ్‌ కోటలో పాగా వేసింది. విశిష్ట ఆస్కార్‌ పురస్కారాలను, అకాడమీ అవార్డులను సొం తం చేసుకుంది. ఇంత సంపాదించుకున్నా జోలీ మనసులో ఏదో ఒక మూల పేదవారి కోసం, అనాథల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పం ఉండేది. ఆ సంకల్పంతోనే తన సంపాదనలో కొంత అనాథల కు సాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించింది.

ముఖ్యంగా శరణార్థుల పిల్లల చదువుల నిమిత్తం జోలీ తన సంపాదనలో కొంత భాగం కేటాయించింది. ఆఫ్గనిస్తాన్‌, కాం బోడియా, జోర్డాన్‌, ఇరాన్‌, ఇరాక్‌ శరణార్థులను కలిసి అక్కడ కూడా తన ప్రదర్శనలు ఇచ్చి ఆ వచ్చిన డబ్బు మొత్తం శరణార్థుల పిల్లల సంక్షేమానికి ఖర్చుచేసేది. 2005లో పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ను కూడా కలిసి శరణార్థుల సమస్యలపై తీవ్రస్థాయి లో చర్చించింది జోలీ. తన జీవిత భాగస్వామి బ్రాడ్‌పిట్‌తో కలిసి అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారిని సంరక్షించే బాధ్యతను చేపట్టింది. ఆఫ్గనిస్తాన్‌లో శరణార్థుల కు టుంబాలకు చెందిన ఆడపిల్లల కోసం ఏర్పాటుచేయబడిన ఒక స్వచ్ఛంద ప్రాథ మిక పాఠశాలకు75 వేల అమెరికన్‌ డాలర్ల విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని మరోసారి నిరూపించు కుంది జోలీ. . ఇటీవల ఆమె వెన్నుదన్నుగా నిలిచిన ఆఫ్గన్‌ స్కూల్‌కు సంబంధించిన విరాళాల సేకరణలో జోలీ తనకు తెలిసినవారినందరినీ సంప్రదించింది.

ఇప్పుడు జోలీ దృష్టి అంతా ఆ స్కూల్‌ పైనే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్‌లో పేద విద్యార్థులు విద్యనభ్యసించాలని జోలీ ఆశయం. వాళ్లకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఆ స్కూల్‌లో చదివి తమ కాళ్లమీద తా ము నిలబడాలన్నది జోలీ కోరిక. ఇప్పుడు ఆమె సదాశయంతో స్థాపించిన స్కూల్‌లో 800 మంది బాలికలు చదువుకుంటున్నారు. రెండు షిఫ్ట్‌లలో పనిచేస్తోంది ఆ స్కూలు.

అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను బోధించడమే గాక...పేదలకు అందని ద్రాక్షలా ఉండే పెద్ద చదువులు సైతం ఇక్కడ చదివే బాలికలకు ప్రతిభ ఆధారంగా పై అధికారులు కల్పిస్తారు. ఏంజిలినా జోలీ గురించి ఒకస్వచ్ఛంద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని ఇలా చెబు తారు. ‘ఏ దేశం అభివృద్ధి అయినా ఆ దేశపు అక్షరాస్యతపై ఆధారపడివుంటుం ది. ఎదుటివారికి సాయం చేయాలనే తలంపు ఉంటే మిగిలిన సహాయాలన్నింటి కన్నా ముందుగా వారి విద్య కోసం పాటుపడాలి. మనం విద్యకోసం చేసే సాయం ఎదుటి మనిషి అభివృద్ధిమీదే గాక యావత్‌ దేశాభివృద్ధిమీద ఆ ప్రభావం తప్పక ఉంటుంది. ఈ విషయంలో జోలీ చేసే సహాయం ఎనలేనిది, కొనియాడదగినది’. సహాయాలు అందరూ చేస్తారు. కానీ ఏంజిలినా జోలీ ఆలోచనా ధోరణి వేరు. కేవ లం రూపాయి సహాయం చేసి వెయ్యిరూపాయల ప్రచారం చేసుకునే వారు ఉండే ఈ రోజుల్లో జోలీ తన సంపాదన అంతా ఇలా అనాథ సేవలకై వినియోగించడం ఎందరికో స్ఫూర్తిదా యకం.