Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఏంజెలినా జోలీ గొప్ప మనస్సు

      ‘కోట్లు కూడగట్టుకుని ఏంలాభం? మనం పోయిన తర్వాత కూడా నలుగురు మన గురించి మాట్లాడుకునే విధంగా వుండాలి. అలా జరగాలంటే ఆపదలో వున్నవారిని ఆదుకోవాలి’ అంటారు హాలీవుడ్ తార ఏంజెలినా జోలి. కేవలం బాహ్య సౌందర్యమే కాదు జోలికి అంతఃసౌందర్యం కూడా వుంది. ఇప్పటివరకు ఇద్దరు అమ్మాయిలను, ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు జోలి. అలాగే తను మొదటిసారి తల్లయినప్పుడు ఆ బిడ్డకి సంబంధించిన ఫొటోలు ప్రచురించే హక్కుని ఓ పత్రికకి ఇచ్చారామె. అమెరికాకు ఆ హక్కులు ఇచ్చినందుకుగాను ఆ పత్రిక 4.1 మిగిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించగా... అంతర్జాతీయ ఫొటోలు ప్రచురించే హక్కులు పొందడానికి ఓ ప్రతిక 3.5 మిగిలియన్ డాలర్లు జోలికి ఇచ్చింది. ఈ డబ్బుని తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాసంస్థకి వినియోగించారు ఈ బ్యూటీ. ఆ తర్వాత జోలి కవల పిల్లలకు జన్మనిచ్చినప్పుడు వారి ఫొటోలు ప్రచురించడానికి ఓ ప్రముఖ ప్రతిక 14 మిలియన్ డాలర్లు ఇచ్చింది. ఈ డబ్బుని కూడా జోలి సేవా సంస్థకే వినియోగించారు. సేవా కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకోవడానికి గల ఏ మార్గాన్నీ జోలి ఒదులుకోరు. తాజాగా, కొంతమంది పిల్లల చదువు నిమిత్తం ఆమె నిధి సమకూర్చాలనుకున్నారు. దానికోసం ‘ఆస్ర్పే’ అనే నగల డిజైనర్ షోరూమ్ తో ‘టైఅప్’ అయ్యారు బ్రాడ్ పిట్, జోలి. వజ్రపుటుంగరాలు, బంగారం, వెండిపూత పూసిన బేబీ స్పూనులు, ఫొటో ఫ్రేములు... ఇలా పలు రకాల వస్తువులు తయారు చేయించాలన్నది వీరి ఆలోచన. ఈ వస్తువులను ‘పాము’ రూపంలో తయారుచేయిస్తున్నారట. ఎందుకంటే, 2006లో జోలి గర్భవతిగా వున్నప్పుడు ఆమెకి పాము రూపం పోలిన ఉంగరాన్ని ఎవరో బహుమతిగా ఇచ్చారట. అది ఎంతగానో నచ్చడంతో ‘ఆస్ర్పే’ వారికి పాము రూపం పోలిన ఉంగరాలను, స్ఫూన్లను తయారు చేయమని కోరారు. ‘ఆస్ర్పే’ యజమాని కూడా అందుకు అంగీకరించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని పిల్లల చదువు కోసం వినియోగించనున్నారు. లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, టోక్యో, జపాన్, దుబాయ్ లలో గల షోరూమ్స్ లో ఈ వస్తువులను అమ్మకానికి పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం జోలి ‘సాల్ట్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005