ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర జీవితాన్ని ఆధారంగా చేసుకుని 1963లో 'క్లియోపాత్ర' చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ చిత్రానికి
జోసెఫ్ ఎల్. మాంకీ విస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నాలుగు ఆస్కార్ అవార్డులు సాధించింది. అంతేకాకుండా 1963లో
అత్యధిక వసూళ్లు కురిపించిన చిత్రంగా 'నంబర్ వన్' స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఆర్థికంగా మాత్రం ఈ చిత్రం నష్టాలనే
మిగిల్చింది. 44 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 26 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఆ ఏడాది ఇంత భారీగా వసూలు చేసిన చిత్రం ఇదే అయినప్పటికీ ఎక్కువ బడ్జెట్‌తో రూపొందించిన కారణంగా నిర్మాత
మాత్రం నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ చిత్రంలో క్లియోపాత్రాగా ఎలిజబెత్ టేలర్ నటించారు. అంతకుముందు
క్లియోపాత్ర జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చినా, 1963లో విడుదలైన చిత్రానికే ఎక్కువ క్రేజ్ లభించింది.
దానికి ఒక కారణం 'ఎలిజబెత్ టేలర్'. క్లియోపాత్రగా ఆమె బాగా నప్పారని హాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చేశాయ్.
ఇక ప్రస్తుత తరంలో క్లియోపాత్రగా నటించే సత్తా ఏంజెలినా జోలీకే ఉందని హాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
క్లియోపాత్ర శరీరాకృతిలానే ఏంజెలినాది ఉంటుంది కాబట్టే అలా అనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని స్కాట్ రూడిన్
నిర్మించనున్నారు. ఏంజెలినాని దృష్టిలో పెట్టుకునే క్లియోపాత్ర పాత్రను తయారు చేస్తున్నామని రూడిన్ అంటున్నారు.
నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. క్లియోపాత్రలా నటించే అవకాశం వరించడం తనకు దక్కిన
గౌరవంగా ఏంజెలినా భావిస్తున్నారట. ఈ పాత్రలో జీవించడం కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది.
|